Begin typing your search above and press return to search.

థియేటర్లు దొరకలేదు.. హ్యాపీ అంటున్న మనోజ్

By:  Tupaki Desk   |   27 Feb 2017 7:47 AM GMT
థియేటర్లు దొరకలేదు.. హ్యాపీ అంటున్న మనోజ్
X
ఫిబ్రవరి రెండో వారంలోనే రావాల్సిన సినిమా ‘గుంటూరోడు’. కానీ మార్చి మొదటి వారంలో విడుదలవుతోంది. ఫిబ్రవరి అంతటా చాలినన్ని థియేటర్లు దొరక్కపోవడం వల్లే తమ సినిమాను రిలీజ్ చేయలేకపోయామని అంటున్నాడు మనోజ్. ఒక దశలో ఫిబ్రవరి 24నే సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా థియేటర్ల సమస్యతోనే మార్చి 3కు వాయిదా వేసుకున్నట్లు అతను తెలిపాడు. ‘‘ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ మాకు అనుకున్న‌న్ని థియేట‌ర్లు దొర‌క‌లేదు. అందుకు నాకు బాధేమీ లేదు. దేవుడి ద‌య‌వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ హిట్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఉంటున్నాయి. అందువ‌ల్లే మాకు థియేట‌ర్లు దొర‌క‌లేదు. మార్చి 3న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అని మనోజ్ తెలిపాడు.

ఇక ‘గుంటూరోడు’ గురించి మనోజ్ చెబుతూ.. ‘‘భిన్నమైన సినిమాల మధ్య మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నా. ‘గుంటూరోడు’ అలాంటి సినిమానే. ఇది పూర్తిగా హీరోయిజ‌ం మీద నడిచే సినిమా. కథ చాలా సింపుల్ గా ఉంటుంది. సినిమా అంతటా యాక్షన్ టెంపో ఉంటుంది. గుంటూరోడు ఎక్కువ ఆనందం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. కోపం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే వాడి చేతికి దుర‌ద పుడుతుంది. ఆ దుర‌ద ఎలా తీరుతుందో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ దుర‌ద తెచ్చిన ఇబ్బందుల‌ నేపథ్యంలోనే కథ నడుస్తుంది. గుంటూరోడికి ఆనందం వ‌స్తే ఒక స్పెష‌ల్ థీమ్ సాంగ్ వేసుకుని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడు. సినిమా మొత్తం ఆ థీమ్ సాంగ్ ఉంటుంది. ‘గుంటూరోడు’ తర్వా మళ్లీ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తాను. నేను చేసిన సినిమాల్లో ‘ప్రయాణం’.. ‘వేదం’.. ‘నేను మీకు తెలుసా’ లాంటి భిన్నమైన సినిమాలు చాలా ఇష్టం. అవి ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్‌ గా అనిపిస్తాయి’’ అని మనోజ్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/