Begin typing your search above and press return to search.

'గుంటూరోడు'గా వస్తున్నాడటగా...

By:  Tupaki Desk   |   30 Sep 2016 7:53 AM GMT
గుంటూరోడుగా వస్తున్నాడటగా...
X
వరుసగా మూడు నాలుగు ఫ్లాపు సినిమాలను చవిచూసిన మంచు మనోజ్ ఈసారి ఎలాగైనా భారీ హిట్టు కొట్టాలనే ఉద్దేశ్యంతో కాస్త గాట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ - దశరథ్ వంటి దర్శకులు హిట్టు ఇవ్వకపోవడంతో.. ఇప్పుడు మనోజ్ కొందరి కొత్త డైరక్టర్స్ మీద డిపెండ్ అయ్యాడు.

'ఒక్కడు మిగిలాడు' అంటూ ఒక నక్సలైట్ కమ్ ఎల్.టి.టి.ఇ టైపు బ్యాక్ డ్రాపులో మంచు మనోజ్ ఓ సినిమాతో ముందుకొస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ ఫినిష్‌ చేసుకున్న ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ డైరక్టర్. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే మరో సినిమాను 'నా రాకుమారుడు' ఫేం ఎస్.ఎకె.సత్య డైరక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. ఈ సినిమాకు ''గుంటూరోడు'' అంటూ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో కూడా ప్యారెలల్ గా పాల్గొంటున్నాడు మనోజ్.

ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలతో ఫ్లాపులు కొట్టిన మనోజ్.. ఇప్పుడు కొత్త డైరక్టర్లతో ఎటువంటి రిజల్టు దక్కించుకుంటాడో చూడాల్సిందే మనం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/