తారక్ కోసం మనోజ్ అలా చేశాడట!

Wed Sep 26 2018 15:49:15 GMT+0530 (IST)

టాలీవుడ్ లోని చాలామంది నటీనటులు ట్విటర్ - ఫేస్ బుక్ - ఇన్ స్టా గ్రామ్ లలో యాక్టివ్ గా ఉంటారు. అయితే అక్కినేని కోడలు సమంతతో పాటు మంచు వారబ్బాయి మనోజ్....అందరిలోకెల్లా ఎక్కువ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తమ ఫాలోయర్స్ కు మనోజ్ ఓపికగా రిప్లైలు ఇవ్వడంతో పాటు....తనను ట్రోల్ చేసిన వారికి అదే రేంజ్ లో రిటార్ట్ కూడా ఇస్తోన్న సంగతి తెలిసిందే. తాను సొంత కాళ్లపై నిలబడ్డానని - తన తండ్రి సంపాతనతో బ్రతకడం లేదని మనోజ్...ఓ ట్రోలర్ కు దిమ్మదిరిగే సమాధానం చెప్పిన విషయం విదితమే. అదే తరహాలో ఓ అభిమాని....మనోజ్ ను ఓ ఘటన గురించి చెప్పాల్సిందిగా ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేశాడు. మనోజ్ - తారక్ ల చిన్నతనంలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పాలని ఓ అభిమాని మనోజ్ ను కోరాడు. ఆ విషయాన్ని తారక్ నే అడగాలని...దాని గురించి తారక్ బాగా చెబుతాడని మనోజ్ సమాధానమిచ్చాడు.టాలీవుడ్ యంగ్ హీరోలలో మంచు మనోజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హీరోయిజాన్ని పక్కనబెట్టి మరీ....అందరు హీరోలతో  కలిసిపోవాలని...అలాగే అభిమానులు - సామాన్యులతో కూడా ఇంటరాక్ట్ కావాలని మనోజ్ భావిస్తుంటాడు. అందుకే ట్విటర్ లో తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. స్నేహానికి ఎంతో విలువిచ్చే మనోజ్....పలువురు టాలీవుడ్ హీరోలతో స్నేహం కొనసాగిస్తున్నాడు. తారక్ - మనోజ్ మంచి స్నేహితులైన నేపథ్యంలో....ఇటీవల నందమూరి హరికృష్ణ మరణం సమయంలో కల్యాణ్ రామ్ - తారక్ లకు మనోజ్ బౌన్సర్ లా వ్యవహరించి అందరి మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ కోసం చిన్నతనంలో మనోజ్ చేసిన సాహసం గురించి ఓ అభిమాని మనోజ్ ను అడిగాడు. తారక్ ను ఎవరో కొడితే... అది తెలుసుకున్న మనోజ్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి మరీ అతడి చేయి విరగ్గొట్టాడట. ఆ స్టోరీ ఏమిటో పూర్తిగా చెప్పాలని ఓ అభిమాని ట్విట్టర్ లో మనోజ్ ను కోరాడు. అయితే ఆ ఘటన ఏమిటో తారక్  నే అడుగాలని - తనకన్నా తారక్ ...దాని గురించి బాగా చెబుతాడని మనోజ్ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.