Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ అంటున్న మనోజ్

By:  Tupaki Desk   |   9 Feb 2016 11:30 AM GMT
ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ అంటున్న మనోజ్
X
మనోజ్ నా రాక్షస స్నేహితుడు అంటూ మంచు వారబ్బాయితో తన ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతే కాదు.. మనోజ్ వంద కోతులతో సమానం అని కూడా ఎన్టీఆర్ అన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ అలా అనడానికి కారణం లేకపోలేదు. మొన్న వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో చిట్ చాట్ సందర్భంగా చిన్నతనంలో తాను ఎన్టీఆర్ ను ఎలా ఏడిపించేవాడినో గుర్తు చేసుకున్నాడు మనోజ్.

తాను చాలా అల్లరిగా ఉండేవాణ్నని.. ఐతే ఎన్టీఆర్ చాలా బుద్ధిగా ఉండేవాడని.. ఒకసారి తన తల్లితో కలిసి అతను తమ ఇంటికి వస్తే.. తాను తయారు చేసిన బెలూన్ అని చూపిస్తూ దాన్ని పగలగొట్టి అందులో ఉన్న ఇంకంతా ఎన్టీఆర్ మీద పడేట్లు చేశానని.. దానికి సంబంధించిన మార్కు కూడా ఇంకా ఎన్టీఆర్ చేతి మీద ఉంటుందని చెప్పాడు మనోజ్.

తన అల్లరికి ఇంకా చాలా ఉదాహరణలున్నాయని.. ఇంటర్మీడియట్ చదివేటపుడు.. తన చదువు గురించి చెప్పడానికి ప్రిన్సిపాల్ తరచుగా తమ ఇంటికి ఫోన్ చేసేవాడని.. తాను తన తండ్రి వాయిస్ తో మాట్లాడి తన చదువు గురించి ఇంట్లో తెలియకుండా చూసుకునేవాణ్నని మనోజ్ చెప్పాడు. ఇక ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితులు ఎవరని అడిగితే.. ఎన్టీఆర్, సునీల్ అని చెప్పిన మనోజ్.. మల్టీస్టారర్ చేయాల్సి వస్తే కూడా తన ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆరే అని చెప్పాడు. తర్వాతి ఛాయిస్ సునీల్ అన్నాడు.