Begin typing your search above and press return to search.

ఒక్క బుల్లెట్‌ తో అంత మందా అన్న..?

By:  Tupaki Desk   |   11 Dec 2018 9:23 AM GMT
ఒక్క బుల్లెట్‌ తో అంత మందా అన్న..?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ ఘన విజయం దిశగా దూసుకు పోతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్రభుత్వంను కూడా టీ ఆర్‌ ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయం అయ్యింది. ఇలాంటి సమయంలో కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన ఒక ఫొటో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్న విషయం తెల్సిందే. కేటీఆర్‌ గన్‌ గురి పెట్టినట్లుగా ఉన్న ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. ఆ ఫొటోకు ఎంతో మంది కామెంట్స్‌ కూడా పెడుతున్నారు.

తాజాగా ఆ ఫొటోను మంచు మనోజ్‌ కూడా పోస్ట్‌ చేశాడు. ఒక్క బుల్లెట్‌ తో అంత మందా - ఎప్పటికి మర్చిపోని షాట్‌ ఇది. టీ ఆర్‌ ఎస్‌ గెలుపు సందర్బంగా కేటీఆర్‌ అన్న - కేసీఆర్‌ గారికి కంగ్రాట్స్‌. మీరు భవిష్యత్తులో తెలంగాణను మరింతగా అభివృద్ది చేస్తారని - మిమ్ముల ప్రజలు అభిమానిస్తుంటారని మంచు మనోజ్‌ పోస్ట్‌ చేశాడు.

కేటీఆర్‌ పిక్‌ ఏ స్థాయిలో వైరల్‌ అవుతుందో మంచు మనోజ్‌ వ్యాఖ్యలతో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి కేటీఆర్‌ చాలా నమ్మకంగా తాము 100 గెలుస్తామంటూ చెబుతూ వచ్చాడు. అన్నట్లుగానే కాస్త అటు ఇటుగా ఆయన పార్టీకి ఇవి చాలా మంచి ఫలితాలు అని చెప్పుకోవాలి.