Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి ఆ రోజుల్లో...!

By:  Tupaki Desk   |   14 Dec 2018 10:00 AM GMT
మంచు లక్ష్మి ఆ రోజుల్లో...!
X
మంచు వారి అమ్మాయి లక్ష్మి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే మంచు లక్ష్మి తాజాగా మరోసారి ఆసక్తికర పోస్ట్‌ పెట్టి చర్చనీయాంశం అయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలో టీనేజ్‌ లో చేసే పనులు జీవితాంతం గుర్తుంటాయి. అప్పుడు చేసే అల్లరి పనులు- తుంటరి పనులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మంచు లక్ష్మి జీవితంలో కూడా అలాంటి తుంటరి పనులు చాలానే చేసిందట.

హైదరాబాద్‌ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మంచు లక్ష్మికి తన కాలేజ్‌ డేస్‌ గుర్తుకు వచ్చాయట. నేడు ఉదయాన్నే లేచి బయట చూస్తే అప్పటి రోజులు నాకు గుర్తుకు వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. ట్విట్టర్‌ లో మంచు లక్ష్మి.. ఈ వాతావరణం నాకు కాలేజ్‌ బంక్‌ కొట్టిన రోజులు గుర్తు కు తెస్తుంది. కాలేజ్‌ బంక్‌ కొట్టి బంజారా దర్బార్‌ బిర్యానీ తీసుకుని స్నేహితులతో దుర్గం చెరువు వద్ద పెద్ద పెద్ద రాళ్ల పై ఎక్కి తినేవాళ్లం అంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది.

మల్టీ ట్యాలెంటెడ్‌ గా గుర్తింపు దక్కించుకున్న మంచు లక్ష్మి నటిగా- నిర్మాతగా- హోస్ట్‌ గా- బిజినెస్‌ ఉమెన్‌ గా రకరకాల రంగాల్లో రాణిస్తోంది. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ చిత్రం తర్వాత ఈమె మరో సినిమాకు ఇంకా కమిట్‌ కాలేదు. త్వరలోనే రెండు సినిమాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.