Begin typing your search above and press return to search.

మంచు ప్రేమ ఎంత మధురం...

By:  Tupaki Desk   |   4 Aug 2015 5:46 PM GMT
మంచు ప్రేమ ఎంత మధురం...
X
టాలీవుడ్‌ సెలబ్రిటీల్లోనే సరోగసి (కృత్రిమ గర్భం) పద్ధతిలో బిడ్డను కన్న తొలి సెలబ్రిటీ గా లక్ష్మి మంచు పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. లక్ష్మీ విలక్షణమైన వ్యక్తిత్వం, ఓపెన్‌ మైండ్‌ సెట్‌ ఎందరో యువతులకు నేడు ఆదర్శం. ఓ వైపు నటిగా, మరోవైపు నిర్మాతగా, వేరొక వైపు బిడ్డకు తల్లిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న లక్ష్మి మంచు పర్సనల్‌ జీవితాన్ని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుకుంటున్నారనడానికి ఇదిగో ఈ పిక్‌ నిదర్శనం.

లక్ష్మి మంచు విదేశాల్లో చదువుకునే రోజుల్లోనే తమిళ్‌ ఎన్నారై యాండీ శ్రీనివాసన్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే లక్ష్మి మంచు సినిమా కెరీర్‌ ని మలుచుకునే ప్రయత్నంలో అమెరికా నుంచి వచ్చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. యాండీ మాత్రం అమెరికాలోనే ఉద్యోగంలో బిజీ. అయితే విద్యా నిర్వాణ జననం తర్వాత యాండీ హైదరాబాద్‌ వచ్చేశారు. ఇప్పుడు ఈ దంపతులు ఇద్దరూ హైదరాబాద్‌ లోనే ఉంటున్నారు.

ఈ రోజు ఈ జంట వెడ్డింగ్‌ యానివర్శరీ. దంపతుల మధ్య అన్యోన్యాన్ని తెలియజేసే ఫోటో ఒకటి ఆన్‌ లైన్‌ లో అందుబాటులోకొచ్చింది. ముచ్చటగా, మురిపెంగా ఉంది కదూ..