Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి.. వైఫ్‌ ఆఫ్ రామ్

By:  Tupaki Desk   |   15 Jan 2018 7:50 AM GMT
మంచు లక్ష్మి.. వైఫ్‌ ఆఫ్ రామ్
X
అదేంటి.. మంచు లక్ష్మి అంటే.. వైఫ్‌ ఆఫ్‌ ఆనంద్ శ్రీనివాసన్ కదా.. కొత్తగా ఈ 'రామ్' ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్టు. ఎందుకంటే మనం మాట్లాడుతోంది లక్ష్మీ రియల్ లైఫ్‌ గురించి కాదు.. ఆమె చేసే రీల్ లైఫ్‌ ఫీట్ గురించి. పదండి ఈ కథేంటో చూసేద్దాం.

2015లో దొంగాట అనే సినిమాను ప్రొడ్యూస్ చేసిన లక్ష్మి మంచు.. ఆ తరువాత ఇతర ప్రొడక్షన్లలో నటించడమే కాని.. సొంతంగా సినిమాయే తీయలేదు. ఇప్పుడు ''వైఫ్‌ ఆఫ్‌ రామ్'' అనే సినిమాతో ఎట్టకేలకు మళ్ళీ తనే లీడ్ రోల్ లో నటిస్తూ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ మన ముందుకు వస్తోంది. ఈ సినిమాను రాజమౌళి దగ్గర పనిచేసిన విజయ్ నేలకంటి అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ.. ఒక ఎఫ్ ఐ ఆర్ కాపీని చూపిస్తూ.. దానిలో 'దీక్ష' అనే పేరును.. తరువాత 'వైఫ్‌ ఆఫ్‌ రామ్' అనే పేరును చూపించారు. చూస్తుంటే ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని ఇట్టే అర్దమవుతోందిలే.

ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి అసలు ఒక్క సినిమాతో కూడా హిట్టు కొట్టలేదు. లక్ష్మీ బాంబ్ వంటి సినిమాలు బాగా నిరాశనే మిగిల్చాయి. కాబట్టి ఎలాగైనా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది ఈ నటీమణి. అలాగే దర్శకుడు రాజమౌళి దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ కూడా ఇంతవరకు హిట్టు సినిమాతో ఎంట్రీ ఇవ్వలేదు. ఈ కుర్రాడు ఆ ఘనత సాధిస్తాడేమో చూద్దాం.