Begin typing your search above and press return to search.

మంచు ఇంగ్లిష్.. అల్లు ఫేస్ బుక్..

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:30 AM GMT
మంచు ఇంగ్లిష్.. అల్లు ఫేస్ బుక్..
X
తెలుగును అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడటం అంటే.. ఎవరైనా కూడా మంచు లక్ష్మి దగ్గర నేర్చుకోవాల్సిందే. ఆమె ఎక్కువ కాలం అమెరికాలో ఉండి చదువుకోవడం పనిచేయడం కారణంగా ఆ తెలుగు అలా తయారైంది. ఇక సోషల్ మీడియాలో రచ్చలేపడం అంటే అసలు మెగా ఫ్యామిలీలో ముందు అల్లు శిరీష్‌ తోనే తయారైంది. అందుకే ఈ ఇద్దరూ ఇదే కాన్సెప్టుపై ఓ కత్తిలాంటి కామెడీ స్కిట్ చేశారు.

ఈ మధ్యనే జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్‌ లో హోస్టుగా వ్యవహరించిన మంచు లక్ష్మి వద్ద ఇంగ్లిష్ పాఠాలు నేర్చుకున్నాడు అల్లు శిరీష్‌. తనకు ఫేస్‌ బుక్‌ లో ఓ అమ్మాయి పరిచయమైందని లక్ష్మితో అన్నాడు. అతడు అలా అనగానే ''నీ ఫొటోయే పెట్టావా?'' అంటూ సటైర్ విసిరింది లక్ష్మి. ''లేదు.. బన్నీ ఫొటోను పెట్టి ఆ అమ్మాయిని పడేశా.. కాని ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుందాం అంటోంది. నా ఇండియన్ ఇంగ్లీష్‌ విని భయపడుతుందేమో. కాస్త అమెరికన్ ఇంగ్లిష్‌ నేర్పిస్తావా??'' అంటూ రివర్స్ పంచ్ వేశాడు శిరీష్‌. దీంతో 'వాటర్' 'ఐ లవ్ యూ' అన్న పదాలను పలకడమెలాగో చెప్పింది మంచు లక్ష్మి. కొన్ని అక్షరాల మధ్య తేడాను వివరించింది. ఆ తర్వాత వెంటనే మీతో రెండు ముక్కలు నేర్చుకుని మొత్తం అమెరికన్ యాక్సెంట్‌ ని పట్టేశానని శిరీష్ అన్నాడు.

మొత్తంగా ఈ స్కిట్ అంతా ఒకరిమీదన ఒకరు సెటైర్ వేసుకున్నదే అయినా.. జనాల మాత్రం తెగ నవ్వేశారు. ఇకపోతే దీనికంటే ముందు కమెడియన్ ఆలీ బిస్కెట్లు పంచిపెడుతూ మంచు లక్ష్మితో చేసిన కామెడీ పీక్ రేంజులో ఉందిలే.