లక్ష్మీ మంచుకి వేధింపులు?

Fri Oct 19 2018 23:31:11 GMT+0530 (IST)

సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో సెలబ్రిటీలు ఇంటరాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ దసరా సందర్భంగా మంచు ఆల్‌రౌండర్ లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్ నుంచి శరాల్లాంటి ప్రశ్నలు దూసుకొచ్చాయి. అన్నిటికీ ఎంతో సహనంగా సమాధానాలిస్తూ బోలెడంత ఫన్‌ని క్రియేట్ చేశారు లక్ష్మీ.అయితే లక్ష్మీ ప్రసన్నకు జనసేన అభిమానుల నుంచి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. కొంత వ్యంగ్యం.. కొంత వెటకారం.. బోలెడంత ఫన్ మధ్య ఆ సంభాషణలు ఆకట్టుకున్నాయి. ``మీరు ఎవరెవరితో పని చేశారో ఆ దర్శకులందరి నుంచి మీరేం నేర్చుకున్నారు? `` అంటూ జనసేనాని అభిమాని ఒకరు లక్ష్మీ మంచును ప్రశ్నించారు. `సింపుల్ ప్రశ్నలు అడగరోయ్`` అంటూ లక్ష్మీ అంతే ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు. దానికి ఆ వీరాభిమాని అంతే ఇదిగా స్పందిస్తూ.. `అయితే మీ బ్రదర్స్ పేర్లు చెబుతారా?` అంటూ ట్వీటేశాడు. అబ్బచ్చ! అసలు మంచు హీరోలు విష్ణు మనోజ్ పేర్లు తెలియకనే అడిగాడా? అంటే .. అదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసమేనని అర్థమైంది.

దసరా వేళ అభిమానులతో ట్వీట్ ఆన్సర్లు ఇస్తూ గడిపేశారు లక్ష్మీ మంచు. ఇక `మీటూ` ఉద్యమం గురించి కొందరు ట్వీట్లతో ప్రశ్నించారు. నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు మీరు టాలీవుడ్‌లో అలాంటిదేం లేదని అన్నారు. చిన్మయ అంటున్నప్పుడు మాత్రం సపోర్టుగా వచ్చారని ఓ అభిమాని అన్నారు. ``తప్పు జరిగితే నేనెపుడూ వ్యతిరేకిస్తాను. వాయిస్ ఆఫ్ ఉమెన్ (వావ్) తో మహిళలు ధైర్యంగా సమస్యల్ని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని బెటర్‌గా తయారు చేద్దాం`` అని పిలుపునిచ్చారు లక్ష్మీ. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు.. తనకు కూడా లైఫ్‌లో వేధింపులు ఎదురయ్యాయని అయితే అది ఇండస్ట్రీలో కాదని తెలిపారు. అయితే ఇండస్ట్రీలో కాకుండా ఎక్కడ ఎదురయ్యాయి? అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అక్కడితోనే డిస్కషన్ ముగిసింది.