Begin typing your search above and press return to search.

మంచు మేకోవర్ అలా ఉందన్నమాట

By:  Tupaki Desk   |   28 Oct 2016 4:15 AM GMT
మంచు మేకోవర్ అలా ఉందన్నమాట
X
టాలీవుడ్ ట్యాలెంటెడ్ భామల్లో మంచు లక్ష్మి ప్రసన్న పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. తండ్రి మోహన్ బాబు అన్ని దశాబ్దాల కెరీర్ లో అందుకోలేకపోయిన నంది అవార్డును.. అలవోకగా సొంతం చేసుకోగలిగిందంటే.. ఈమె ప్రతిభాపాటవాలు ఏ స్థాయివో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఈ మధ్య కాలంలో లక్ష్మి మంచు సినిమాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి.

మంచు ఫ్యామిలీ వరకూ సినిమాలకు కొరత ఉండదు కానీ.. లక్ష్మీ ప్రసన్న మాత్రం తనకు నచ్చిన పాత్రలను.. తనకు తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. యాక్టింగ్ లో తప్ప లుక్ లో మాత్రం ఇన్నేళ్లలో పెద్దగా వేరియేషన్ చూపించని లక్ష్మి మంచు.. ఇప్పుడు హఠాత్తుగా కొత్త అవతారంలో దర్శనమిచ్చేసింది. గతంలో కాసింత ఒళ్లు చేసి కనిపించే ఈమె.. ఇప్పుడు సడెన్ గా సన్నబడిపోయి.. మోడర్న్ టైమ్స్ ఏంజెల్ లా కనిపించేసింది. ముక్కు పుడక.. అంత పెద్ద ఇయర్ రింగ్స్.. మెడలో డిజైనర్ హారం.. చేతికి మెరిసిపోతన్న గాజులు.. అన్నిటికీ మించి డిఫరెంట్ గా ఉన్న డ్రెసింగ్.. మంచు లక్ష్మి ఒక్కసారిగా మెరుపులు కురిపించేసింది. ఈమె నుంచి ఈ రేంజ్ మేకోవర్ ఊహించని చాలా మంది షాక్ తినేశారు కూడా.

ప్రస్తుతం లక్ష్మీ బాంబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న లక్ష్మి మంచు.. ఆసినిమాలో పవర్ ఫుల్ కేరక్టర్ చేసేసింది. ఈ మూవీని నడిపించే లీడ్ రోల్ ఈమెదే కావడంతో.. లేడీ ఓరియెంటెడ్ మూవీతో సత్తా చాటేందుకు ట్రై చేస్తోందని ఫిక్స్ అయిపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/