Begin typing your search above and press return to search.

చిత్రమైన పాత్రలో మంచు లక్ష్మి

By:  Tupaki Desk   |   24 May 2018 2:05 PM GMT
చిత్రమైన పాత్రలో మంచు లక్ష్మి
X
గత రెండు మూడేళ్లుగా మంచు ఫ్యామిలీ కష్టాలు మామూలుగా లేవు. ఆ ఫ్యామిలీలోని నటీనటులందరికీ దారుణమైన ఫలితాలు ఎదురవుతున్నాయి. అందరూ ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త ఏడాదిలో అయినా కథ మారుతుందేమో అనుకుంటే.. ‘గాయత్రి’.. ‘ఆచారి అమెరికా యాత్ర’ లాంటి డిజాస్టర్లు ఎదురయ్యాయి. ఇప్పుడు మంచు లక్ష్మీప్రసన్న లైన్లోకి వచ్చింది. ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. ఇదొక భిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. మంచు లక్ష్మి అందులో డిఫరెంటుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పెళ్లయిన మహిళ పాత్ర పోషిస్తోంది. ఆ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఆ క్యారెక్టర్ గురించి చిత్ర బృందం చెబుతున్న సంగతులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఈ సినిమాలో మంచు లక్ష్మి అనుక్షణం భయపడుతున్నట్లే కనిపిస్తుందట. అంతలోనే భయం విడిచిపెట్టి పోరాడుతుందట. ఆమె క్యారెక్టర్ ఒక పట్టాన అర్థం కానట్లు సాగుతుందట. స్క్రీన్ ప్లే చాలా భిన్నంగా ఉండి ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ.. ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుందట. మంచు లక్ష్మి కెరీర్లో ఇదొక భిన్న ప్రయోగం అంటున్నారు. ఈ మధ్య తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలకు మంచి ఫలితం దక్కుతున్న నేపథ్యంలో కొంచెం రిస్కీగా ఉండే సబ్జెక్టుతోనే ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం. విజయ్ ఎలకంటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వివ్వప్రసాద్ నిర్మాత. జూన్ 1న ‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్ రిలీజవుతుంది. ఆ నెలలోనే సినిమాను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. మరి ఈ చిత్రమైన మంచు వారికి ఓ విజయాన్నిస్తుందేమో చూడాలి.