Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి సినిమా బాలీవుడ్ వెళ్తోందా?

By:  Tupaki Desk   |   3 Sep 2015 11:58 AM GMT
మంచు లక్ష్మి సినిమా బాలీవుడ్ వెళ్తోందా?
X
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్డోళ్లకు చాలా చిన్న చూపుండేది. కానీ కొన్నేళ్ల కిందట స్లంపులో ఉన్న బాలీవుడ్ ను ఆదుకున్నది సౌత్ సినిమాలే. ఇక్కడి మసాలా సినిమాల్ని బాలీవుడ్ టేస్టుకు రీమేక్ చేసుకుని భారీ విజయాలందుకుంది బాలీవుడ్. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్.. ఇలా ప్రతి చోటి నుంచి సినిమాల్ని పట్టుకెళ్లి బాలీవుడ్ లో వసూళ్ల పంట పండించుకున్నారు. ఐతే తెలుగు వరకు ప్రధానంగా పోకిరి, రెడీ, కిక్ లాంటి మాస్ మసాలా సినిమాలే బాలీవుడ్ కు వెళ్లాయి. ఒక్క ‘అనుకోకుండా ఒక రోజు’ మినహాయిస్తే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఇక్కడి నుంచి హిందీకి వెళ్లలేదు. ఐతే ఇప్పుడో కామెడీ థ్రిల్లర్ బాలీవుడ్ లో రీమేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సమ్మర్లో విడుదలై ఓ మోస్తరుగా ఆడిన మంచు లక్ష్మి సినిమా 'దొంగాట'ను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ రీమేక్ కు సంబంధించి సంప్రదింపులు పూర్తయ్యాయట. తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించిన వంశీ కృష్ణనే రీమేక్ కోసం అడుగుతున్నారట. అతను స్క్రిప్టును బాలీవుడ్ కు తగ్గట్లు తీర్చిదిద్దే పనిలో ఉన్నాడట. అతను దర్శకత్వం వహించకపోయినా స్క్రిప్ట్ కన్సల్టంట్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి. 'దొంగాట' మంచి అంచనాల మధ్య విడుదలైంది కానీ.. ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఐతే ఇలాంటి కాన్సెప్టులు బాలీవుడ్లో బాగా వర్కవుటయ్యేు అవకాశాలున్నాయి. అక్కడ లో బడ్జెట్ లో ఇలాంటి కామెడీ థ్రిల్లర్స్ వస్తుంటాయి. మంచి కాస్టింగ్ కుదిరితే ఇంపాక్ట్ బాగానే ఉంటుంది.