Begin typing your search above and press return to search.

ఆ స్కామ్ మీద మంచు ఫ్యామిలీ సినిమా

By:  Tupaki Desk   |   23 March 2017 7:53 AM GMT
ఆ స్కామ్ మీద మంచు ఫ్యామిలీ సినిమా
X
మంచు విష్ణు ‘లక్కున్నోడు’.. మంచు మనోజ్ ‘గుంటూరోడు’.. మంచు లక్ష్మి ‘లక్ష్మీబాంబు’.. దేనికి ఏదీ తీసి పోదు. అన్నీ అట్టర్ ఫ్లాపులే. దీంతో మంచు ఫ్యామిలీ సినిమాల ఎంపికపై పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రొటీన్ సినిమాలు చేస్తే బండి నడవడం కష్టమని.. ట్రెండుకు తగ్గట్లుగా డిఫరెంటుగా ఏదైనా చేయాలని చూస్తోందంట మంచు ఫ్యామిలీ టీం. ఇందుకోసం రియలిస్టిక్ సినిమా మీద దృష్టిపెట్టారట. సమకాలీన అంశాలపై సినిమాలు తీయడంపై మంచు కాంపౌండ్లో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దిశగా ఒక సబ్జెక్ట్ కూడా రెడీ అవుతోందట.

ఓ కాల్ సెంటర్ స్కామ్ నేపథ్యంలో సినిమా తీయడానికి మంచు ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా వాళ్లకు టోకరా వేసి కోట్ల కొద్దీ డబ్బు సంపాదించిన మీరా రోడ్ కాల్ సెంటర్ స్కామ్ నేపథ్యంలో సినిమా తీసేందుకు సమాచారం సేకరిస్తున్నారట. థానే పోలీసుల నుంచి ఈ స్కామ్ గురించి మంచు టీం వివరాలు సేకరిస్తోందట. ఈ సినిమా గురించి తెలుగు మీడియాకు ఏమీ చెప్పకపోయినా.. ముంబయి నుంచి సమాచారం బయటికి వచ్చేసింది. ఐతే ఈ సినిమా ఎవరి కోసం అన్నది ఇంకా ఖరారవ్వలేదు. సబ్జెక్ట్ రెడీ అయ్యాక అది విష్ణుకు సరిపోతుందా.. మనోజ్ కు సరిపోతుందా చూసుకుని.. ఎవరో ఒకరితో సొంత బేనర్లోనే ఈ సినిమాను తీస్తారట. దర్శకుడి ఎంపిక కూడా స్క్రిప్టు రెడీ అయ్యాకే ఉంటుందని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/