టీజర్: మనసుకు నచ్చేలా భలే తీశారే

Tue Dec 12 2017 13:40:36 GMT+0530 (IST)

ప్రతి మనిషిలో ప్రపంచమంత ప్రేముంటుందిరా.. కాని 0.1 పర్సెంట్ కూడా బయటకి రావట్లేదు. ఒక్కసారి మన హార్టుతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రేమంతా పరిచయం అవుతుంది అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది అనుకుంటున్నారా?. సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్ మంజుల ఘట్టమనేని తెరకెక్కించిన మనసుకు నచ్చింది సినిమాలోనిది.రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేశారు. నటిగా కొన్ని సినిమాల్లో కనిపించిన మంజుల మొదటి సరిగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆమె దర్శకత్వం చేయబోతున్నారు అనగానే అంతా ఏమో అనుకున్నారు గాని మొత్తానికి టీజర్ తో ఓ రొమాంటిక్ ఫీల్ ని తెప్పించారు. ప్రస్తుతం టీజర్ ప్రేక్షకులను చాలా ఆకర్షిస్తోంది. సాయి మాధవ్ బుర్ర అందించిన మాటలు చాలా బాగున్నాయి. మంజుల మేకింగ్ స్టైల్ టీజర్ లోనే చూపించేశారు. ఇక సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ - త్రిధ చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మంజుల కూతురు కూడా ఓ పాత్ర పోషిస్తోంది. ఇక సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ కానుంది. అప్పుడు అనుష్క బాగమతి కూడా రిలీజ్ అవ్వనుంది. కొంచెం పోటీ గట్టిగానే ఉందనిపిస్తోంది. మంజుల భర్త సంజయ్ స్వరూప్ - ఆనంది ఆర్ట్స్ కిరణ్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ వరుస అపజయాలతో చాలా సతమతమవుతున్నారు. మరి ఈ సినిమా అతనికి ఎంతవరకు విజయన్నీ అందిస్తుందో చూడాలి.