Begin typing your search above and press return to search.

పవన్ నా బావ అంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   25 Sep 2016 4:58 AM GMT
పవన్ నా బావ అంటున్న హీరోయిన్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్ అంటేనే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. పైగా పవన్ కి మరదలిగా నటించే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో.. ఇప్పటికే కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ ను చూస్తూనే ఉన్నాం. అత్తారింటికి దారేది చిత్రంతో.. ఈ భామను బాపు బొమ్మగా మార్చేశాడు పవన్. ఇప్పుడు తెరకెక్కుతున్న కాటమరాయుడు చిత్రంలో మరో బ్యూటిఫుల్ హీరోయిన్ ని మరదలు చేసేసుకున్నాడు పవన్.

రెండేళ్ల క్రితం రొమాన్స్ మూవీలో ప్రిన్స్ తో కలిసి నటించిన మానస హిమవర్ష.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మరదలు అయిపోయింది. 'కాటమరాయుడు మూవీలో పవన్ కళ్యాణ్ కి మరదలిగా నటిస్తున్నాను. ఆయన్ను ఇష్టపడే అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. పవన్ ఇంటిలోనే ఉంటూ.. తన బ్రదర్స్ తో కలిసి ఆయన్ని టీజ్ చేసే రోల్ ఇది. సినిమా అంతా పట్టులంగా.. లంగా ఓణీల్లోనే కనిపిస్తాను. పవన్ లాంటి పెద్ద స్టార్ కి మరదలిగా నటించడం బోలెడంత హ్యాపీ' అంటోంది మానస హిమవర్ష.

ఇప్పటికే కాటమరాయుడు షూటింగ్ లో మానస హిమవర్ష జాయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె నారా రోహిత్ మూవీ 'అప్పట్లో ఒకడుండేవాడు'లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో నక్సల్ పాత్రలో ఈ మాసన హిమవర్ష కనిపించనుందని తెలుస్తోంది.