కుర్ర హీరోయిన్ నోరుపారేసుకుంది

Mon Jul 17 2017 16:47:57 GMT+0530 (IST)

'రొమాన్స్' సినిమాతో కాస్త పాపులర్ అయిన హీరోయిన్ మానస హిమవర్ష.. ఆ తరువాత మొన్నటి 'ఫ్యాషన్ డిజైనర్' వరకు చాలా సినిమాల్లో నటించింది కాని.. ఆమె నటనకు పేరు.. చేతికి ఆఫర్లు.. రెండూ పెద్దగా రాలేదు. కాని ఒక్కసారిగా ఇప్పుడు మాత్రం అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. బిగ్ బాస్ షో పుణ్యమా అంటా.. ఈ అమ్మడు ఇప్పుడు పెద్ద న్యూస్ అయ్యిందిలే.

నిజానికి 'బిగ్ బాస్' తెలుగు వర్షన్ లో పార్టిసిపెంట్లుగా తీసుకోవడానికి చాలామందిని కన్సిడర్ చేశారు. ఆడిషన్ కూడా చేశారు. అయితే అందులో చాలామంది రిజక్ట్ అయ్యారు. ఆ లిస్టులో మానస కూడా ఉందంటూ ఎప్పుడో టాక్ వచ్చింది. ఇప్పుడు మాత్రం రాత్రి బిగ్ బాస్ షో పూర్తవ్వగానే.. థ్యాంక్ గాడ్ ఈ షోలో నేను భాగం అవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది అమ్మడు. మరి కేవలం ఒక ఓపెనింగ్ ఎపిసోడ్ చూసేసి ఈ కార్యక్రమం గురించి ఒక జడ్జ్ మెంట్ కు రావడం అనేది.. ఎంతవరకు సబబో ఆమెకే తెలియాలి కాని.. ఈ ప్రోగ్రామ్ ను కామెంట్ చేయడం వలన ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆమెను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేశారంతే. ఆ దెబ్బకి అమ్మడు.. ఎన్టీఆర్ ను అనలేదని.. కాని షో గురించి కామెంట్ చేశానని.. తాను చెప్పింది నిజమేనని చెప్పింది. కాని కుర్ర హీరోయిన్ నోరుపారేసుకోవడంతో.. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడ తగ్గకుండా ఇష్టంవచ్చినట్లు తిట్టేశారు.

ఇకపోతే ఒక ప్రక్కన అసలు 'బిగ్ బాస్' కార్యక్రమాన్ని కామెంట్ చేస్తే సహించపోవడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యాడ్ బిహేవియర్ అయితే.. ఆ షోలో భాగంకాలేని వారందరూ ఇలా సదరు షో బాలేదంటూ అప్పుడే కామెంట్లు చేయడం కూడా బాధాకరమే. అది సంగతి.