Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: మీడియా అయితే నాకేంటి

By:  Tupaki Desk   |   24 Aug 2016 4:15 PM GMT
టీజర్ టాక్: మీడియా అయితే నాకేంటి
X
ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకం సబ్జెక్టుతోనే వస్తుంటాడు మ్యూజిక్ కంపోజర్ ఆర్.పి.పట్నాయక్. గతంలో మనోడు బ్రోకర్ సినిమాతో ఏ రేంజులో హంగామా చేశాడో మనకు తెలిసిందే. అయితే సినిమాలో కథ బాగానే ఉంటుంది కాని.. ఇతగాడిలోని దర్శకుడు - నటుడు మాత్రం అట్టర్ ఫ్లాపే. ఆ తరువాత చాలా దెబ్బలు తిని ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు.

''మనలో ఒకడు'' అనే కొత్త సినిమాతో వస్తున్నాడు పట్నాయక్. ఈ సినిమాలో మనోడే సెంట్రల్ పాత్రను పోషిస్తూ డైరక్షన్ చేస్తున్నాడు. సినిమా మొత్తం.. మీడియా యాజమాన్యాలు మాకు మేమే సాటి ఎలా ప్రగల్భాలు పలుకుతుంటాయి.. అలాంటి మీడియాల కారణంగా.. ఒక కామన్ మ్యాన్ కి ఒళ్లుమండితే ఏం జరుగుతుంది అనే కథను చెప్పబోతున్నాడు ఆర్.పి. ఈ సినిమాలో మీడియా ఛానల్ ఓనర్ గా సాయికుమార్.. ఇతర ప్రముఖ పాత్రల్లో తనికెళ్ళ భరణి - నాజర్ - బెనర్జీ తదితరులు నటిస్తున్నారు. కాని ట్రైలర్ లో ఆర్పీ ''మీడియా అయితే నాకేంటి'' అని అరుస్తూ ఇచ్చిన ఎక్సప్రెషన్ ఒక్కటే బాగా వీక్ కా ఉంది.. మిగతా అందరూ బాగానే ఉన్నారు.

ఈ మధ్యన సెన్సేషనల్ కథలు ఏమొచ్చినా కూడా జనాల బాగానే ఆదరిస్తున్నారు. చూద్దాం మరి ఆర్పీ కొత్త సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ రాబోతోందో!!