ఎమ్ ఎల్ ఏ గారి కోసం హాట్ పి.ఏ

Mon Jul 17 2017 15:36:19 GMT+0530 (IST)

పనులు మానేసి తన హాట్ పి.ఏతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఎమ్ ఎల్ ఏ. ఏంటి ఇదేదో పాలిటిక్స్ వ్యవహారం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది సినిమా వ్యవహారం - ప్రొడ్యూసర్ కమ్ హీరో కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ మూవీ ఎమ్ ఎల్ ఏ శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు హిట్లు కొడుతూ హీరోగా తన ఉనికుని కాపాడుకుంటూ వస్తున్న కళ్యాణ్ రామ్. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టార్స్ తో అటు నిర్మాతగా ఇటు హీరోగా బ్యాడ్ టైమ్ లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఎమ్ ఎల్ ఏ అనే కొత్త సినిమాను కళ్యాణ్ రామ్ ప్రారంభించడం - అందులో కాజల్ హీరోయిన్ గా నటించేందుకు అంగీకరిచడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా  నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మనాలీ రాథోడ్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎమ్ ఎల్ ఏ లో నటిస్తుందని సమాచారం. మనాలీకి కళ్యాణ్ రామ్ కి మధ్య నడిచే రొమాంటిక్ ఎపిసోడ్స్ శ్రుతులు మించాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పటివరకు ఓ ఫ్యామిలీ ఇమేజ్ తో కెరీర్ లాకొస్తున్న కళ్యాణ్ రామ్ ఈ కొత్త కోణంలో ఎలా ఉండబోతున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ