Begin typing your search above and press return to search.

వైఎస్సార్ ను గుర్తుకు తెస్తున్న మమ్ముట్టి

By:  Tupaki Desk   |   7 Sep 2018 6:25 AM GMT
వైఎస్సార్ ను గుర్తుకు తెస్తున్న మమ్ముట్టి
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించిన స్వర్గీయ వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' టైటిల్ తో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ రోజు అయన పుట్టిన రోజు.

మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా 'యాత్ర' టీమ్ సినిమానుండి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఫిలిం యూనిట్ మెగాస్టార్ మమ్ముట్టి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఫస్ట్ లుక్.. టీజర్ లు రిలీజ్ అయ్యాయి కాబట్టి వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఎలా ఒదిగిపోయారో అందరికీ తెలుసు. అయినప్పటికీ తాజా పోస్టర్ లో వైఎస్ ట్రేడ్ మార్క్ జెస్చర్ లో ఎడమ చెయ్యి పైకి లేపి ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ ను మరోసారి గుర్తుకు తెచ్చారు.

ఒక పక్కకు ఒత్తుగా పాపిడి తీసి దువ్వుకున్న జుట్టు.. అచ్చ తెలుగుదనానికి ప్రతీక అయిన తెల్లచొక్కా.. ధోవతీ.. పైన.. కండువాతో గెటప్ అదిరిపోయింది. గెటప్ మాత్రమే కాకుండా మేనరిజమ్స్ కూడా డిటో ఉండేలా శ్రద్ద తీసుకున్నాడు. దీన్ని బట్టి మమ్ముట్టి ఎలాంటి గొప్ప నటుడో మనకు మరో సారి అర్థం అవుతుంది. ఇలాంటి పోస్టర్లతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.