Begin typing your search above and press return to search.

మల్లిక మళ్లీ ఒబామాతో మీటింగ్

By:  Tupaki Desk   |   11 Feb 2016 6:00 AM GMT
మల్లిక మళ్లీ ఒబామాతో మీటింగ్
X
మర్డర్ బ్యూటీ - బికినీ క్వీన్ బిరుదులతో దేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది మల్లికా శరావత్. చాలా కాలం క్రితమే హాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లిపోయిన ఈ సుందరాంగి.. ఇప్పుడు కంప్లీట్ గా లాస్ ఏంజెల్స్ లోనే సెటిల్ అయిపోయింది. గత ఐదేళ్లలో ఈమె చేసిన హిందీ సినిమాలు రెండే రెండంటే.. హాలీవుడ్ లో ఏ రేంజ్ ప్రయత్నాలు చేసేస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఒక్కసారిగా మల్లిక గురించి బాలీవుడ్ జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటోనే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ఓ సెల్ఫీ దిగిన ఈ సుందరాంగి.. దాన్ని సోషల్ నెట్ వర్కింగ్ లో పెట్టింది. దీంతో ఒక్కసారిగా మల్లిక గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఓసారి ఒబామాను కలిసిన ఈమె.. గత వారం రోజులుగా వాషింగ్టన్ లో ఉంటోంది. మరోసారి అమెరికా ప్రెసిడెంట్ ను కలిసి.. ఆ సంతోషాన్ని ట్విట్టర్ జనాలతో పంచుకుంది.

"ఇంత ఛరిష్మా ఉన్న ఒకే ఒక్క ప్రెసిడెంట్ బరాక్ ఒబామాను మళ్లీ కలుసుకునే అదృష్టం దక్కింది"అంటూ ట్వీట్ రాసి మల్లికా షెరావత్ చేసిన పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.