Begin typing your search above and press return to search.

పది రోజుల ముందే మల్లేశం ప్రీమియర్లు

By:  Tupaki Desk   |   11 Jun 2019 8:09 AM GMT
పది రోజుల ముందే మల్లేశం ప్రీమియర్లు
X
చేనేత రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన చింతకింది మల్లేశం బయోపిక్ ఈ నెల 21న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకాగా బిజినెస్ ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నట్టు టాక్. ఈ నేపధ్యంలో బజ్ ని ఇంకా పెంచేందుకు నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు పది రోజుల ముందుగానే ప్రీమియర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ సాయంత్రం ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేయబోతున్నారు.

ఇప్పటికే దీని తాలుకు ఆహ్వానాలు పంపేశారు.విడుదల రోజున ఉదయం 9 గంటలకు షో వేస్తేనే పబ్లిక్ టాక్ రివ్యూల వల్ల కలెక్షన్స్ తగ్గుతున్నాయని ఒకవైపు నిర్మాతలు అంటుంటే ఇలా ఏకంగా పది రోజుల ముందే షో వేయడం అంటే సాహసమే. దీనికి కారణం సురేష్ బాబుతో సహా టీం మొత్తానికి ఉన్న కాన్ఫిడెన్స్ అని తెలుస్తోంది. ఇప్పటికే అవుట్ పుట్ చూసుకుని పూర్తి నమ్మకం కలిగాకే ఇంత ఎర్లీగా మీడియాకు చూపించే నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

గతంలోనూ ఇదే తరహాలో పెళ్లి చూపులు - కేరాఫ్ కంచేరపాలెంలకు ఫాలో అయిన స్ట్రాటజీ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు మల్లేశంకు అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందనే ధీమా అయితే టీం లో కనిపిస్తోంది. ప్రియదర్శి టైటిల్ రోల్ పోషించిన మల్లేశంకు రాజ్ ఆర్ దర్శకుడు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా ప్రియదర్శికి జోడిగా అనన్య నటించింది. సో రేపటి నుంచే మల్లేశం తాలూకు బైట్స్ అప్ డేట్స్ మీడియా నుంచి అందనున్నాయన్న మాట.