ట్రెండింగ్: డ్రైవర్ కూల్చిన కాపురం!

Wed Jan 23 2019 11:56:54 GMT+0530 (IST)

ఆవిడ డ్రైవర్ .. ఆయన డ్రైవర్ కి గుట్టు లీక్ చేశాడు. దాంతో ఎఫైర్ రహస్యాలు అందరికీ లీకైపోయాయి.. ఇది తెలిసిన ఆ డ్రైవర్ ని ఆవిడ చెడామడా తిట్టేసింది... తిత్తి తీసి తోలు వలుస్తానని వార్నింగ్ ఇచ్చిందట!! బాప్ రే!! అసలు ఈ కథేంటి? కథలోని కమామీషు ఏంటి? అంటే కాస్తంత లోతుగా వివరాల్లోకి వెళ్లాల్సిందే.గత కొంతకాలంగా బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా అరోరాఖాన్ యువహీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫైర్ లో నెక్ట్స్ లెవల్ ఇక పెళ్లాడుకోవడమే అంటూ ప్రచారం సాగుతోంది. మలైకా- అర్జున్ ఎఫైర్ పై పుష్కలంగా కథనాలు వండి వార్చడంలో బాలీవుడ్ మీడియా తలమునకలుగా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. అసలు మలైకా ఎఫైర్ సంగతులన్నీ బయటి ప్రపంచానికి ఎలా లీకయ్యాయి?  మలైకా ఎక్స్ హబ్బీ ఆర్భాజ్ కి ఈ ఎఫైర్ గురించి ఎలా తెలిసింది? అంటే ఓ టాప్ సీక్రెట్ రివీలైంది.

మలైకా సీక్రెట్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు తన కార్ డ్రైవర్ స్వయంగా బయటికి లీకులిచ్చేసేవాడట. అదెట్టా? అంటే.. మలైకా వద్ద పని చేసే కార్ డ్రైవర్ ముఖేష్ - ఆర్భాజ్ దగ్గర పని చేసే బబ్లూ ఇద్దరూ అన్నదమ్ములు. మలైకా విషయంలో ఏం జరుగుతున్నా దానిని ముఖేష్ తన తమ్ముడు బబ్లూకి చేరవేసేవాడు. బబ్లూ వెళ్లి ఆర్భాజ్ చెవిలో ఊదేవాడు. అలా ఆ గుట్టు కాస్తా రట్టయ్యింది. ఆ క్రమంలోనే ఆర్భాజ్ - మలైకా మధ్య చిచ్చు రేగి కాపురంలో కల్లోలం తప్పలేదు. అయితే ఈ రహస్యం తెలుసుకున్న మలైకా ఆ వెంటనే తన కార్ డ్రైవర్ ముఖేష్ ని పిలిచి లెఫ్ట్ & రైట్ కోటింగ్ ఇచ్చిందని తెలిసింది. ఇకపై తనకు సంబంధించిన విషయాల్ని లీక్ చేస్తే కఠినమైన శిక్ష తప్పదని డ్రైవర్ కి వార్నింగ్ ఇచ్చిందిట. ఇక మలైకా- అర్జున్ తొందర్లోనే పెళ్లి చేసుకునేందుకు ప్రిపేరవుతున్నారని తెలుస్తోంది. పెళ్లికి ముందే ముంబైలో ఓ ఖరీదైన ఏరియాలో లగ్జరీ అపార్ట్ మెంట్ ని కొనుక్కునేందుకు రెడీ అవుతున్నారు.

ఇంట్రెస్టింగ్ గా ఈ ఇద్దరి ఎఫైర్ వల్లా ఇప్పుడు కపూర్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. అనీల్ కపూర్ సోనమ్ కపూర్  అర్జున్ కి సపోర్టుగా నిలస్తుంటే బోనీకపూర్ అన్షులా కపూర్(అర్జున్ చెల్లెలు) అర్జున్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆర్భాజ్ అన్న సల్మాన్ ఈ ఎఫైర్ విషయమై చాలా సీరియస్ గా ఉన్నాడు. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలతో అతడు ఇంకా కలతకు గురయ్యాడట. ఆ క్రమంలోనే తనకు ఎంతో సన్నిహితుడైన బోనీకపూర్ తన ఇంటికి రాకూడదని బ్యాన్ విధించాడట. దీంతో బోనీ చాలానే భయపడుతున్నారన్న మాటా వినిపిస్తోంది. ఇక సదరు యువహీరో కెరీర్ ఆల్మోస్ట్ గోల్ మాల్ అయినట్టేనన్న మాటా ప్రముఖంగానే వినిపిస్తోంది. ఇదంతా ఎఫైర్ తెచ్చిన తంటా సుమీ!