Begin typing your search above and press return to search.

మేల్‌ డామినేషన్‌.. టూమచ్‌ గురూ

By:  Tupaki Desk   |   1 Sep 2015 11:28 PM GMT
మేల్‌ డామినేషన్‌.. టూమచ్‌ గురూ
X
సినిమా పరిశ్రమలో 'మేల్‌ డామినేషన్‌' ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌ ఇది. మన సినిమా హీరోని ప్రమోట్‌ చేయడానికి మాత్రమే. తెలుగు సినిమాని తరచి చూస్తే నాయికు ఎలాంటి ప్రాధాన్యత కనిపించదు. చెట్టు పుట్టల్లో తిరుగుతూ హీరోతో డ్యూయెట్ లు పాడుకోవడానికి, నాలుగైదు సన్నివేశాల్లో కనిపించడానికి మాత్రమే కథానాయిక పనికొస్తుంది.

రెసిడెంట్‌ ఈవిల్‌ హీరోయిన్‌ లా, మ్యాట్రిక్స్‌ భామలా, మేలిఫిషియెంట్‌ ఏంజెలినా జోలీలా మన నాయికల్ని చూపించాలన్న కామన్‌ సెన్స్‌ మన దర్శక హీరోలకు లేనేలేదన్న విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు ఈ విషయంపై హీరోయిన్లు తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు కూడా. ఇటీవలి కాలంలో రిలీజైన బాహుబలి చిత్రంలో అవంతిక క్యారెక్టర్‌ పై మేల్‌ డామినేషన్‌ అంటూ ఓ ప్రముఖ మహిళా జర్నలిస్టు ఆన్‌ లైన్‌ లో విరుచుకుపడడం పెద్ద టాపిక్‌ అయ్యింది. హీరోయిన్‌ ఉన్నది మగాడికి లొంగిపోవడానికేనా? అని ప్రశ్నించారు సదరు జర్నలిస్ట్‌.

ఎన్టీఆర్‌ టెంపర్‌ లో కాజల్‌ పాత్ర ఇలాంటిదే. మూగ జీవాల్ని సంరక్షించే సేవికురాలిగా కాజూ అందులో కనిపించింది. వాటి క్రాసింగ్‌ సరే.. మా సంగతేంటి? అంటూ ఎన్టీఆర్‌ చేత జోకేయించాడు పూరీ. అంటే హీరోయిన్‌ నాశిరకం, మేల్‌ కి సపోర్ట్‌ కోసమేననే మీనింగ్‌ని చూపించారక్కడ. రామ్‌ పండగ చేస్కో సినిమాలోనూ రకూల్‌ ప్రీత్‌ ఇలాంటి క్యారెక్టర్‌ లోనే నటించింది.

అనుష్క, త్రిష, నిత్యా మీనన్‌ లాంటి నాయికలు చాలాసార్లు మేల్‌ డామినేటేడ్‌ ఇండస్ట్రీ అంటూ బహిరంగంగానే ప్రకటించి అసహనాన్ని వెల్లగక్కారు. హీరోలకోసమే సినిమాలు తీస్తున్నారు. హీరోయిన్‌లు గ్లామర్‌ డాళ్స్‌ అన్న విమర్శలు ఎప్పటికప్పుడు రిపీటవుతూనే ఉన్నాయి. అలా కాకుండా సినిమాలో హీరో క్యారెక్టర్‌కి ధీటుగా ఉండే హీరోయిన్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసే రోజులు టాలీవుడ్‌లో వస్తాయంటారా?