Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ పై మెగాస్టార్ ఒపీనియ‌న్ ఇదా?

By:  Tupaki Desk   |   15 Jun 2019 12:14 PM GMT
క్రిటిక్స్ పై మెగాస్టార్ ఒపీనియ‌న్ ఇదా?
X
సినీ స‌మీక్ష‌కుల‌పై వ్య‌తిరేకుల జాబితా పెరుగుతోందా? రివ్యూలు.. రేటింగులు అంటూ క్రిటిక్స్ చేస్తున్న ప‌నిని నిర‌సించే స్టార్లు పెరుగుతున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇండ‌స్ట్రీ టాప్ స్టార్లు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు క్రిటిక్స్ పై ఎందుక‌నో ఒక ర‌క‌మైన అసంతృప్తి క‌నిపిస్తోంది. అయితే వందేళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఫిలిం క్రిటిక్స్ పై హీరోలు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇదే తీరుగా స్పందించ‌డం చూస్తున్న‌దే.

చెట్టు ముందా.. విత్తు ముందా? అన్న‌ది చూస్తే సినిమా పుట్టాకే క్రిటిక్స్ పుట్టినా ఎవ‌రి వృత్తి వాళ్లు కొన‌సాగించాల్సిన స‌న్నివేశం ఉంటుంది ఇక్క‌డ‌. చెత్త సినిమాలు తీసి జ‌నాల నెత్తిన రుద్దుతామంటే క్రిటిక్స్ క‌లాల‌కు ప‌ని చెప్ప‌కుండా ఉండ‌లేరు. అయితే ఇక్క‌డే వ‌చ్చిందో చిక్కు. సినిమాలకు 2 రేటింగ్.. 3 రేటింగ్.. 4 రేటింగ్ .. 4.25 రేటింగ్ .. అంటూ ఇలా రేటింగులు ఇస్తుంటే అది త‌మ సినిమాల్ని కిల్ చేస్తోంద‌ని కింగ్ ఖాన్ షారూక్ అంత‌టివారే వాపోవ‌డం సంచ‌ల‌న‌మైంది. సినిమా మొత్తాన్ని ఒకే గాటాన‌ క‌ట్టేసి త‌గ్గించేయ‌కుండా కేవ‌లం విశ్లేషించి వ‌దిలేస్తే బావుంటుంద‌ని ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చారు బాద్ షా. మ‌న‌మంతా సినిమా వాళ్లం. మంచి క‌థ‌ల్ని మేం తెర‌పై చూపించాల‌నుకుంటున్నాం.. చూపించ‌నివ్వండి..!! అని షారూక్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రేటింగుల పేరుతో సినిమాని చంపొద్ద‌ని క్రిటిక్స్ స‌మ్మేళ‌నంలో అన్నారు.

అయితే ఇది క‌రెక్టేనా? అన్న ప్ర‌శ్న‌కు మ‌ల‌యాళీ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఇచ్చిన ఆన్స‌ర్ స‌ర్ ప్రైజ్ ని ఇచ్చింది. షారూక్ ఆవేద‌న నా ఆవేద‌న ఒక‌టే. అయితే మేం చేయ‌గ‌లిగేదేం లేదు. ఎవ‌రూ ఆప‌గ‌లిగేదేం లేదు! అంటూ పెద‌వి విరిచేశారు మ‌మ్ముట్టి. జ‌నాల్ని థియేట‌ర్ల వ‌ర‌కూ రానివ్వండి. సినిమా చూసి వారే నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఇవ్వండి.. ఇలా అభ్య‌ర్థించ‌డం త‌ప్ప చేసేదేం లేద‌ని మ‌మ్ముట్టి అన్నారు. ఒకరి వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని స‌మీక్ష పేరుతో రుద్దేయ‌డం స‌రికాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇది చెత్త సినిమానా కాదా? అనేది జ‌నాల్నే నిర్ణ‌యించుకోనివ్వండి అని ఒపీనియ‌న్ తెలిపారు.

ఇక షారూక్ కి స‌పోర్టుగా నిలిచినా మ‌మ్ముట్టి కాస్తంత సాఫ్ట్ గానే మాట్లాడారు. ఇక క్రిటిక్స్ పై హార్డ్ కోర్ కామెంట్ల‌తో .. తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌తో ఊగిపోయే వాళ్ల‌కు కొద‌వేం లేదు. ఈ జాబితాలో ప‌లువురు ఉత్త‌రాది- ద‌క్షిణాది స్టార్లు.. సెల‌బ్రిటీలు ఉన్నారు. ఆర్జీవీ - పూరి- తేజ - రాజ‌మౌళి .. ఎవ‌రైనా క్రిటిక్స్ పై కాస్త వ్య‌తిరేకంగానే స్పందించ‌డం చూశాం. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు వెళ్ల‌నివ్వండి.. అంత‌కుముందు దెబ్బ కొడ‌తారెందుకు? అంటూ వీళ్లంతా వాపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే సినిమా బావుంటే ఏ శ‌క్తీ ఆప‌లేదు. బావుండ‌ని సినిమా వ‌ర‌కూ క్రిటిక్స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంటుంది. ఇక బావున్న సినిమాకి థియేట‌ర్ల‌కు జ‌నాల్ని తీసుకెళ్లే బాధ్య‌త‌ను క్రిటిక్స్ స‌వ్యంగానే నిర్వ‌ర్తిస్తున్నారు. మ‌రి వీళ్ల‌లో పాజిటివ్ యాంగిల్ గురించి కూడా స‌ద‌రు స్టార్లు మాట వ‌ర‌స‌కైనా ప్ర‌స్థావించి ఉంటే బావుండేదేమో!!