Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కోచ్: సంచలన విషయం వెల్లడించిన హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Feb 2019 10:08 AM GMT
క్యాస్టింగ్ కోచ్: సంచలన విషయం వెల్లడించిన హీరోయిన్
X
ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది ఈమధ్యకాలంలో ఒక బర్నింగ్ టాపిక్ లాగా మారిపోయింది. కాస్త చల్లారినట్టు అనిపించినా ఎవరో ఒకరు క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలతో ముందుకొస్తారు.. వెంటనే అది హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్ గా మలయాళం హీరోయిన్ కనీ కుస్రుతి ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది .

క్యాస్టింగ్ కోచ్ న్యూసెన్స్ వల్ల సినిమాలను వదిలేసి బతుకుదెరువు కోసం వేరే ఉద్యోగం చూసుకోవాల్సి వచ్చిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తనకు ఎదురైన సంఘటనను వివరిస్తూ ఒక డైరెక్టర్ తనను బెడ్ రూమ్ కు తీసుకెళ్లాలని విశ్వప్రయత్నం చేశాడని తెలిపింది. అతను కనీని ఒప్పించేందుకుఎంత దూరం వెళ్ళాడంటే.. కనీ కుస్రుతి అమ్మగారితో ఈ విషయం మాట్లాడి తన బెడ్ రూమ్ కు మీ అమ్మాయి వచ్చేలా ఒప్పించమని ఒత్తిడి చేశాడట. ఆ డైరెక్టర్ 'బెడ్ రూమ్ ఆఫర్' కు ఒప్పుకోకపోవడంతో తనకు ఆ సినిమా ఆఫర్ చేజారిందని తెలిపింది.

ఆ తర్వాత నెమ్మదిగా ఆఫర్లు రావడం తగ్గాయని అందుకే సినిమాలను వదిలేయాలని నిశ్చయించుకున్నానని తెలిపింది. #మీటూ ఉద్యమం ఫిలిం ఇండస్ట్రీలో మార్పు తీసుకొస్తోందని అభిప్రాయపడింది. కానీ ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ బారిన పడిన వారు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పింది.