Begin typing your search above and press return to search.

వారెవ్వా.. ర‌వితేజ హీరోయిన్ ఫీట్

By:  Tupaki Desk   |   16 July 2018 1:07 PM GMT
వారెవ్వా.. ర‌వితేజ హీరోయిన్ ఫీట్
X
పోల్ చుట్టూ గింగిరాలు తిరుగుతూ వెండితెర‌పై సెగ‌లు కురిపిస్తుంటారు భామ‌లు. సినిమాల్లో పోల్‌ డ్యాన్స్‌ కి య‌మా క్రేజ్ ఉంది. అయితే అలాంటి అవ‌కాశం ఇంకా ర‌వితేజ హీరోయిన్‌ కి రాలేదు కానీ.. ప్ర‌స్తుతానికి ఆ పోల్ చుట్టూ హాట్ హాట్ విన్యాసాలు చేస్తూ గ‌డుపుతోంది. ప‌నిలో ప‌నిగా పోల్ ద‌గ్గ‌ర తానెంత హాట్‌గా ఉంటుందో మ‌చ్చుకు కొంచెం ఆన్‌ లైన్‌ లో చూపించింది. అది చూసి సో హాట్ గురూ అంటున్నారు కుర్ర‌కారు. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో తెలుసు క‌దా. `నేలటికెట్టు`లో ర‌వితేజ స‌ర‌స‌న ఆడిపాడిన మాళ‌విక శ‌ర్మ‌. తెలుగులో చేసిన తొలి సినిమానే చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది.

కానీ ఈమెలో తెలుగు క‌థానాయిక‌ల‌కి కావ‌ల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి. ఏ క్ష‌ణంలోనైనా కొత్త‌గా అవ‌కాశాలు త‌లుపు త‌ట్టొచ్చు. అందుకేనేమో జిమ్‌ లోకి దూరి క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టేసింది. త‌న అందాన్ని మ‌రింత నాజూగ్గా మార్చుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ పోల్ విన్యాసాలు చేస్తోంది. పోలే నాకు కుర్చీగా మారింది చూడండి అంటూ ఎంచ‌క్కా పోల్‌ పైనే కూర్చుంది. అది చాలా క‌ష్ట‌మైన విన్యాసం అని నిపుణులు అంటున్నారు. మాళ‌విక కూడా ``చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ.. తొడ‌లు నొప్పెడుతున్నాయి. కానీ ఆ నొప్పికి త‌గ్గ ప్ర‌తిఫ‌లాన్నిచ్చే విన్యాస‌మే ఇది`` అంటూ ఆన్‌ లైన్‌ లో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ‌.