Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: నేల టికెట్ భామ హైక్లాస్ పోజు

By:  Tupaki Desk   |   17 July 2019 6:36 AM GMT
ఫోటో స్టొరీ: నేల టికెట్ భామ హైక్లాస్ పోజు
X
మాళవిక శర్మ తెలుసు కదా.. ఈ మధ్య పట్టయా టైగర్ పార్క్ లో పులితో పరాచికాలాడుతూ అందమైన ఫోటోలు తీయించుకుంది. పులి ఫోటోలు.. అనగానే వెంటనే మీకు గుర్తు వచ్చేసి ఉంటుంది లెండి. ఈ హాటు భామ తన వెకేషన్ ను ఇంకా పూర్తి చేయలేదు. ప్రస్తుతం ఫుకెట్ లో ఫుల్లుగా చిల్ అవుట్ అవుతూ ఉంది. పాప సోషల్ మీడియాలో యమా యాక్టివ్ కాబట్టి అక్కడి నుంచి ఒక అప్డేట్ ఇచ్చేసింది.

తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసి "గ్లోయింగ్ విత్ సెల్ఫ్ లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇట్టాంటి వాటిని అనువాదం చేయాలంటే మాచెడ్డ ఇబ్బంది. "స్వీయప్రేమతో మెరుస్తున్నాను" అని అనుకోవాలి. కానీ అందంగా ఉండదు. "నాప్రేమలో నేనే సంతోషంగా వెలిగిపోతున్నా" అనుకోవాలి. నిజమే.. పక్కనోడి ప్రేమలో పడితే లేని పోని కండిషన్లు.. కమిట్మెంట్లు. అదే మన ప్రేమలో మనం పడితే ఆ ఇబ్బందులు ఏవీ ఉండవు. అందుకే ఈ భామ ఫుకెట్ లో బంగ్లా వాకింగ్ స్ట్రీట్ లో సింగిల్ గా నడుస్తూ నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోందట. ఆ సందర్భంగా వేసుకున్న డ్రెస్సు అదిరిపోయింది. చందనం రంగు టీ షర్టు.. ఐస్ బ్లూ కలర్ షార్ట్ ధరించింది. యాక్సెసరీస్ ను పూర్తిగా దూరం పెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ తరహాలో కనిపిస్తోంది. ఖజురహో శిల్పానికి ఒక టీషర్టు.. షార్టు వేస్తే అలా ఉంటుందో.. సరిగ్గా అలానే ఉంది. పనిలో పనిగా ఫుకెట్ వాసులకు తన నాభి అందాలను వడ్డించింది.

ఈ భామ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "టూ మచ్ హాట్ బేబీ".. "ఫ్యాబ్యులస్ అండ్ ఫెంటాస్టిక్ ఫిగర్".. "సెక్సీ డ్రెస్.. కిల్లర్ స్మైల్".. "పర్ఫెక్ట్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే మాళవిక చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు.