Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: గ్లామర్ గేట్లు ఎత్తిన మాళవిక

By:  Tupaki Desk   |   16 Nov 2018 10:41 AM GMT
ఫోటో స్టొరీ: గ్లామర్ గేట్లు ఎత్తిన మాళవిక
X
మలయాళం హీరోయిన్ మాళవిక నాయర్ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలలోనే నటించినా ఇంతవరకూ పెద్ద బ్రేక్ అయితే రాలేదు. ఎవడే సుబ్రమణ్యం'.. 'కళ్యాణ వైభోగమే' లాంటి సినిమాలతో పాటుగా ఈమధ్య 'మహానటి' సినిమాలో జెమిని గణేశన్ భార్య పాత్రలో కూడా నటించి అందరినీ ఆకట్టుకుంది. కానీ మెగా హీరో కళ్యాణ్ దేవ్ తో నటించిన 'విజేత' బాక్స్ ఆఫీసు దగ్గర నిరాశపరిచింది.

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ అయినా 'టాక్సీవాలా' స్టొరీ అంతా మాళవిక పాత్ర చుట్టూనే తిరుగుతుందట. 'టాక్సీవాలా' రిలీజ్ రేపే కాబట్టి మాళవిక ఎలాంటి పాత్ర పోషించిందో మనకు రేపే తెలుస్తుంది. ఇదిలా ఉంటే మాళవిక ఈమధ్య హాటు రూటుకి మారినట్టుగా ఉంది. మాళవిక మొదటి నుండి చేసినవి గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రలే. దీంతో గ్లామర్ షో కు అవకాశం లేకుండా పోయింది. ఓన్లీ టాలెంట్ తో నెట్టుకు రావడం గ్లామర్ ఇండస్ట్రీలో కష్టమే కదా. మరి ఈ విషయాన్ని మాళవిక గుర్తించిందేమో గానీ ఒక హాట్ ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో సన్నటి చెక్స్ ఒక బ్లేజర్ ను.. షార్ట్ మిడీని ధరించిన మాళవిక ఫుల్లుగా క్లీవేజ్ షో చేసింది. ఇక ఈ గ్లామర్ షో ఎందుకోసమో అర్థం చేసుకోవాల్సిన ఫిలిం మేకర్స్ త్వరగా అర్థం చేసుకుంటే మాళవిక బుట్టలో ఒకటో రెండో గ్లామర్ పాత్రలు పడే అవకాశం ఉంది.