Begin typing your search above and press return to search.

టాక్సీ డ్రైవర్ తో ప్రేమాయణం

By:  Tupaki Desk   |   15 Aug 2017 10:47 AM GMT
టాక్సీ డ్రైవర్ తో ప్రేమాయణం
X
ఒక్కోసారి హీరోయిన్స్ సినిమాల్లో ఎంత కష్టపడ్డ వారికి అంతగా ఛాన్సులు రావు. అలాగే వాళ్ళు తీసిన సినిమాలు ఎంత హిట్ అయినా నెస్ట్బి సినిమాలో అదృష్టం ఉంటే మంచి చాన్స్ లబోస్తోంది. ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటోంది మాళవిక నాయర్. మలయాళీ చిత్ర పరిశ్రమ ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ భామకు వచ్చిన మొదట్లో మంచి పేరు తెచ్చుకుంది.

2013 లో కాస్త బిజీ అయిన ఈ అమ్మడు తర్వాత 2015 లో టాలీవుడ్ లో నాని సరసన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చాన్స్ కొట్టేసి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా మాళవిక నాయర్ కి మాత్రం అంత పెద్దగా అవకాశాలు రాలేవు. ఆ తర్వాత నాగ శౌర్యతో కళ్యాణ వైభోగమే అనే సినిమాలో కూడా చేసింది. కాని తరువాత చదువే ముఖ్యమంటూ డిగ్రీ పూర్తి చేయడానికి ఊరెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న విజయ్ దేవరకొండతో ఓ మంచి ఛాన్స్ కొట్టేసింది. రాహుల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశాడు విజయ్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో విజయ్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.

అసలే ఈ మద్యన టాలీవుడ్లో మల్లూ భామల తాకిడి ఎక్కువైంది. కీర్తి సురేష్‌.. అనూ ఎమ్మానుయేల్.. క్యాథరీన్ త్రెసా.. అబ్బో ఈ గ్యాంగ్ ఆఫ్‌ గాళ్స్ ఇరగదీస్తున్నారంతే. మరి మాళవిక కూడా వీరి సరసన చేరుతుందా?