మాళవిక.. ఇలా అయ్యిందేంటి?

Mon Jun 25 2018 21:00:01 GMT+0530 (IST)

గ్లామర్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది హీరోయిన్స్ కు ఉంటుంది. అయితే అందాలు విచ్చల విడిగా ఆరబోసినంత మాత్రాన ఆ ఇమేజ్ రాదు. సింపుల్ గా కనిపించినప్పటికీ గ్లామర్ గర్ల్ అని కొన్ని సార్లు నేమ్ వస్తుంది. ప్రస్తుతం సౌత్ లో గ్లామర్ గర్ల్స్ చాలా మంది ఉన్నారు. అయితే కొందరు అటు వైపు ఎక్కువగా వెళ్లడం లేదు. సింపుల్ గా కనిపించి నటనతో అవకాశాలను అందుకుంటున్నారు.ఇకపోతే రీసెంట్ గా మాళవిక నాయర్ గ్లామర్ టచ్ ఇవ్వాలని అనుకుందో ఏమో గాని ఆమె వచ్చిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. శారీ లో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అమ్మడు కళ్యాణ్ దేవ్ - విజేత సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.రీసెంట్ గా జరిగిన ఆడియో రిలీజ్ వేడుకకు మాళవిక చాలా డిఫెరెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. చీరను చూటుకోవడంలో కొత్త తరహా స్టైల్ ని ఫాలో అయ్యి చివరికి కామెడీ అయ్యేలా చేసుకుంది.

సోషల్ మీడియాలో ఆమె స్టైలింగ్ పై పలురకాల కామెంట్స్ వస్తుండడం వైరల్ అవుతోంది. కాస్త హాట్ గా కనిపించడానికి ట్రై చేసి ఇలాంటి రోల్స్ కి కూడా సిద్దమే అని చెప్పకనే చెప్పేసింది ఈ బ్యూటీ. ఇక విజేత సినిమాపై ప్రస్తుతం అంచనాలు కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పెద్దగా హిట్స్ అందుకొని మాళవిక ఈ విజేత సినిమాతో అయినా కెరీర్ ను ఒక ట్రాక్ లోకి సెట్ చేసుకుంటుందో లేదో చూడాలి.