Begin typing your search above and press return to search.

'హీరో' హీరోయిన్‌ కు 'మహర్షి' తో రిలేషన్‌

By:  Tupaki Desk   |   20 May 2019 5:27 AM GMT
హీరో హీరోయిన్‌ కు మహర్షి తో రిలేషన్‌
X
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈయన తెలుగులోనే కాకుండా తన ఇమేజ్‌ ను ఇతర సౌత్‌ భాషల్లో కూడా బిల్డ్‌ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాన్ని సౌత్‌ లో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' అనే చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ గా మాళవిక మోహనన్‌ నటించనుంది.

తమిళంలో పలు సినిమాల్లో నటించిన మాళవిక మోహనన్‌ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే 'పేట' డబ్బింగ్‌ చిత్రంతో పరిచయం అయ్యింది. అయితే ఆమె డైరెక్ట్‌ తెలుగు సినిమా మాత్రం 'హీరో' అని చెప్పుకోవచ్చు. మాళవిక తండ్రి మోహనన్‌ ఇటీవలే 'మహర్షి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తమిళం మరియు బాలీవుడ్‌ లో ఎన్నో పెద్ద చిత్రాలకు, హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మోహనన్‌ తెలుగులో మొదటి సారి 'మహర్షి' చిత్రం కోసం వర్క్‌ చేశాడు. అద్బుతమైన కెమెరా వర్క్‌ తో మోహనన్‌ సినిమా స్థాయిని పెంచాడు. ఇప్పుడు ఆయన కూతురు మాళవిక తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.

నటిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న మాళవిక తండ్రి పేరును వాడుకోకుండా కెరీర్‌ లో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రజినీకాంత్‌ చిత్రం పేటలో సూపర్‌ స్టార్‌ కు చెల్లి పాత్రలో నటించి మెప్పించిన మాళవిక ఇప్పుడు విజయ్‌ దేవరకొండ 'హీరో' చిత్రంలో నటించబోతుంది. వీరిద్దరి కాంబో ఎలా ఉంటుందో చూడాలి. హీరోలో విజయ్‌ దేవరకొండ బైక్‌ రేసర్‌ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. మొదటి షెడ్యూల్‌ను ఢిల్లీలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.