Begin typing your search above and press return to search.

అర్జున్ బర్త్ డే..మలైకా విషెస్.. నెటిజన్ల రచ్చ!

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:54 AM GMT
అర్జున్ బర్త్ డే..మలైకా విషెస్.. నెటిజన్ల రచ్చ!
X
బాలీవుడ్ లో లవ్ ఎఫైర్లు కామన్.. బ్రేక్ అప్స్ కామన్. ఇలాంటివి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈమధ్య ట్రెండ్ మారి లవ్ జంటల మధ్య వయసు తేడా ఎక్కువ కావడంతో ఆ జంటల మీద జనాల ఫోకస్ ఎక్కువవుతోంది. నలభై ఐదేళ్ళ హాటు బ్యూటీ మలైకా అరోరా ముప్పై నాలుగేళ్ళ అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉండడంతో బాలీవుడ్లోనే కాకుండా దేశం మొత్త మీద ఇదో 'ప్రధాన సమస్య'గా మారింది. ఈరోజు అర్జున్ కపూర్ పుట్టిన రోజు దీంతో మరోసరి అందరి ఫోకస్ ఈ జంటపైకే మళ్ళింది.

అర్జున్ బర్త్ డే సందర్భంగా మలైకా అరోరా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నా క్రేజీ.. ఇన్సేన్లీ ఫన్నీ & అమేజింగ్ అర్జున్ కపూర్ కు హ్యాపీ బర్త్ డే. ప్రేమ.. సంతోషం ఎప్పడూ ఉండాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో ఒక అందమైన బీచ్ లో ప్రేమ పక్షులలాగా ఒకరి చేతిలో ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఇద్దరూ ప్రేమ తన్మయత్వంలో.. ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. పైకి అధికారికంగా 'మేము లవర్స్' అంటూ చెప్పినా చెప్పకపోయినా ఈ రోజు ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేసినట్టే. అందుకంటే "నా క్రేజీ అర్జున్" అని ఊరికే అంటారా ఏంటి.. పైగా "ఇన్సేన్లీ ఫన్నీ" అంట. ఏం నాటీ థింగ్స్ లేకుండా అట్టాంటి కాంప్లిమెంట్లు ఎట్టా వస్తాయి?

ఈ ఫోటోకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోయింది. అర్జున్ కపూర్ కు బర్త్ డే విషెస్ చెప్తూనే పనిలో పనిగా ఈ జంటకు కూడా అభినందనలు తెలిపారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో సెటైర్లతో చంపేశారు. ఒకరు "హ్యాప్తీ బర్త్ డే మలైకా అర్జున్" అన్నారు. మరొక నెటిజన్ ఇన్స్టా ఐడీ 'బోనీ కపూర్ అఫిషియల్'.. ఈ ఐడీతో "సత్యానాష్..గయా కామ్ సే మేరె బేటా" అన్నారు. ఇంకొకరు "మున్ని బద్నామ్ హుయి డార్లింగ్ అర్జున్ కేలియే" అన్నారు. మరొకరు "మేరె సాత్ మా హై" అన్నారు. వీటిని తెలుగులోకి అనువదిస్తే కామెంట్స్ లోని స్పార్క్ మిస్ అవుతుంది కాబట్టి అలానే ఉంచడం జరిగింది. ఏదైతేనేం.. ఈరోజు అర్జున్ -మలైకా జోడీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.