ఫోటో స్టోరీ : పొట్టినిక్కరులో కెవ్వుకేకో!

Sun Sep 23 2018 22:28:32 GMT+0530 (IST)

బికినీ బీచ్ లో అందాలు ఆరబోయడం.. పొట్టి నిక్కరులో కుర్రకారును రెచ్చగొట్టడం ఈ అమ్మడికి కొత్తేమీ కాదు. కెరీర్ ఆరంభించిందే ఐటెమ్ నంబర్లతో. ఛయ్య ఛయ్య సాంగ్ తో మొదలు పెట్టి - అటుపై ఎన్నో బ్లాక్ బస్టర్ ఐటెమ్ నంబర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మలైకా ఆరోరాఖాన్. దబాంగ్ లో మున్ని బదనాము హుయీ.. ఓ సంచలనమే. ఆ క్రమంలోనే సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే అతడిని విభేధించి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అదంతా సరే.. ప్రస్తుతం మలైకా ఎవరితో అయినా డేటింగ్లో ఉందా?  ఆర్భాజ్ ఇప్పటికే తననుంచి విడిపోయాక వేరొక అందగత్తెతో డేటింగులో ఉండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ క్రమంలోనే మలైకాకు ఈ ప్రశ్న ఎదురవుతోంది. అయితే ఇదే ప్రశ్న మలైకాని అడిగితే.. నా డేటింగ్ ముగిసింది.. చేసిన వ్యక్తినే పెళ్లాడాను.. అక్కడితో అది ఎండ్ అయ్యింది అని తనదైన శైలిలో చెక్ పెట్టేసింది.

ఇప్పటికీ తనకు ఐటెమ్ గాళ్గా ఉన్న గుర్తింపును ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఐటెమ్ పాటలతోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. డ్యాన్సులు చేసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నించానని మలైకా గర్వంగా చెప్పుకుంది. అన్నట్టు ఇటీవలే ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి బయటకు వచ్చిన మలైకా ఆ పరిసరాల్ని ఒక్కసారిగా హీటెక్కించింది. పెర్ఫెక్ట్ స్పోర్ట్స్ వేర్.. అందునా టైట్ ఫిట్ డ్రెస్లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆ పొట్టినిక్కరుతో హొయలు పోయిన తీరు కుర్రకారుకు కంటిపై కునుకు కరువయ్యేలా చేసింది. ఇంతగా రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టే ఆ సోగదేహాన్ని అంత ఇదిగా మెయింటెయిన్ చేయగలుగుతోంది మలైకా. ఆ క్షణం అందరికీ అర్థమైంది ఇదొక్కటే!