Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ కు కూల్ గిఫ్ట్ : మేకింగ్ వీడియో

By:  Tupaki Desk   |   21 May 2019 6:42 AM GMT
మహేష్ ఫ్యాన్స్ కు కూల్ గిఫ్ట్ : మేకింగ్ వీడియో
X
బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్న మహర్షి గ్రాఫ్ పడిపోకుండా టీమ్ చాలా పక్కా ప్లానింగ్ సినిమా గురించిన చర్చ కొనసాగించేలా చేస్తోంది. మొన్నటి దాకా యూనిట్ వెన్నంటే ఉండి తన పాతికేళ్ల కెరీర్ లో ఏ సినిమాకు చేయనంత అగ్రెసివ్ ప్రమోషన్ దీనికే చేసిన మహేష్ హాలిడేస్ కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో మహర్షి టీమ్ కొత్త ఎత్తుగడలతో వస్తోంది. అందులో భాగంగా మేకింగ్ వీడియోని విడుదల చేశారు.

సాధారణంగా షూటింగ్ ఎలా జరుగుతుంది అనే దాని పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. స్టార్ హీరోల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. అందుకే అధిక శాతం సినిమా చివర్లో వచ్చే ఎండ్ క్రెడిట్స్ లో ఈ వీడియోలు చూపించి అలరిస్తూ ఉంటారు. మహర్షి తాలూకు వీడియో అలా కాకుండా యుట్యూబ్ లోకి అందుబాటులోకి వచ్చింది

యాక్షన్ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అరవడం తప్ప ఇంకే సౌండ్ ఇందులో లేదు. మొత్తం ఆన్ లొకేషన్ విజువల్స్ తో నింపేశారు. సెకండ్ హాఫ్ మొత్తం నడిచే విలేజ్ సెట్ ని రూపొందించడం రైతులుగా నటించిన జూనియర్ ఆర్టిస్టులను వందలాదిగా బస్సులో తీసుకురావడం డెహ్రాడూన్ లో జరిగిన కాలేజీ ఎపిసోడ్ తాలూకు షాట్స్ కొన్ని కట్ చేయడం యుఎస్ లో తీసిన సన్నివేశాలు ఇవన్నీ మేకింగ్ వీడియో లో పొందుపరిచారు.

రెండున్నర నిమిషాలే ఉన్నప్పటికీ అభిమానులను అలరించేలా మహేష్ ఆన్ ది సెట్స్ ఎలా ఉంటాడన్న బిట్స్ ఉండటం ప్లస్ అయ్యింది. నమ్రతా-సితార-గౌతమ్ లు కూడా ఉండటం ఇందులో మరో ఆకర్షణ. మొత్తానికి ట్రైలర్ కన్నా ఈ మేకింగ్ వీడియో ఆకర్షణీయంగా ఉండటం అసలు ట్విస్ట్. వ్యూస్ కూడా భారీగానే వస్తున్నాయి.