Begin typing your search above and press return to search.

కామెంట్‌: మజ్నుకి అన్నీ కలిసొచ్చేశాయ్

By:  Tupaki Desk   |   23 Sep 2016 10:30 PM GMT
కామెంట్‌: మజ్నుకి అన్నీ కలిసొచ్చేశాయ్
X
నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి.. అన్ని ఏరియాల నుంచి మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగింది. రెండుతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా.. మజ్నుకి ఓపెనింగ్స్ అదిరాయంటే.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అర్ధమవుతుంది. మౌత్ టాక్ కూడా బాగుండడంతో.. ఈ వీకెండ్ లో అత్యధికంగా లాభపడే మూవీ ఇదే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ముందు రోజు రిలీజ్ అయిన ధనుష్-కీర్తి సురేష్ ల మూవీ రైల్ కు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. రెండో రోజుకే బాగా డల్ అయ్యాయి. టాక్ దారుణంగా ఉండడం ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ పాయింట్ అంటున్నారు. ఇక గత వారం రిలీజ్ అయిన నాగ్ మూవీ నిర్మలాకాన్వెంట్ ఏ మాత్రం పుంజుకునే ఛాన్స్ లేదని ట్రేడ్ జనాలు అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు కనీసం 80 శాతం నష్టాలు తప్పవనే అంచనాలున్నాయి. టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చిన సాగర్ నటించిన సిద్ధార్ధ పరిస్థితి అయితే.. మరీ దారుణంగా ఉంది.

ఇక యంగ్ టైగర్ మూవీ జనతా గ్యారేజ్ ఇంకా ఆడియన్స్ ని రాబట్టగలగుతున్నా.. ఇండస్ట్రీ రికార్డుల్లో ఇప్పుడున్న పొజిషన్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. శ్రీమంతుడు కలెక్షన్స్ ను దాటే ఛాన్సులు చాలా తక్కువ అంటున్నారు. మొత్తం మీద ఈ వీకెండ్ నాని మజ్నుకి రాసిచ్చేశారనే చెప్పేయచ్చు.