అంత పోటీలో కూడా 'మజిలీ'కి అరుదైన రికార్డ్

Fri May 24 2019 15:46:29 GMT+0530 (IST)

నాగచైతన్య సమంత జంటగా శివ నిర్వాన దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మజిలీ'. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి ఓపెనింగ్స్ మరియు లాంగ్ రన్ కలెక్షన్స్ రాబట్టుకోవడంతో నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. సమంత మరియు నాగచైతన్య కాంబోకు ఏ స్థాయి క్రేజ్ ఉందో ఈ సినిమా చెప్పకనే చెప్పింది.ఈ చిత్రం విడుదల సమయంలోనే జర్సీ చిత్రలహరి కాంచన 3 ఆ తర్వాత మహర్షి చిత్రాలు వచ్చాయి. అయినా కూడా ఈ చిత్రం మంచి లాంగ్ రన్ ను దక్కించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం 25 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సూపర్ హిట్ చిత్రాలు కూడా రెండు మూడు వారాలకు థియేటర్ల నుండి వెళ్లి పోతున్నాయి. కాని ఏకంగా 25 థియేటర్లలో 50 రోజులు ఈ చిత్రం పూర్తి చేసుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

మహర్షి చిత్రం విడుదలైన సమయంలో కూడా 'మజిలీ' చిత్రం కొనసాగింది. ఇక అంతకు ముందు వచ్చిన జర్సీ మరియు కాంచన 3 చిత్రాలకు ఈ చిత్రం గట్టి పోటీని ఇచ్చి నిలిచింది. ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాల్లో కలిపి 25 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. నైజాంలో ఈ చిత్రం ఒక్క చోట కూడా 50 రోజులు పూర్తి చేసుకోలేదు. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్ష దేవుళ్లకి కృతజ్ఞతభినందనాలు అంటూ 50 రోజులు పూర్తి చేసుకున్న థియేటర్ల జాబితాతో పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. మొత్తానికి చైతూకు ఒక మంచి సాలిడ్ సక్సెస్ పడింది. ఈ సినిమాతో చైతూ క్రేజ్ బాగా పెరగడంతో పాటు పారితోషికం కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది.