Begin typing your search above and press return to search.

ముదురు పాక్ లేడీ.. నాకూ కావాలంటోంది

By:  Tupaki Desk   |   23 Jan 2017 8:01 AM GMT
ముదురు పాక్ లేడీ.. నాకూ కావాలంటోంది
X
మన దగ్గరైతే పెళ్ళయ్యి పిల్లలున్న సీనియర్ హీరోయన్ ను మెయిన్ లీడ్ గా తీసుకోవాలంటే ఏడుస్తారు కాని.. అదే పాకిస్తాన్ నుండి వచ్చిన అలాంటి ఓ ముదురు లేడీని మాత్రం షారూఖ్‌ ఖాన్ లీడింగ్ లేడీగా పెట్టుకున్నాడు. అవును.. పాక్ లేడీ మహీరా ఖాన్ గురించి ఈ డిస్కషనంతా. అమ్మడు ఇప్పుడు ''రయీస్‌'' సినిమా కోసం తెగ బాధపడిపోతోంది. పదండి చూద్దాం.

''ఇండియాలో నన్ను రయీస్ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనివ్వకపోవడం దురదృష్టకరం. నేనేం తప్పు చేశాను? రయీస్‌ నా సినిమా కూడా. ఈ సినిమా కోసం నేనెంతో కష్టపడ్డాను. షారూఖ్‌ ఖాన్ పక్కన కూర్చొని ఈ సినిమాను ప్రమోట్ చేయాలని నాక్కూడా కోరికగా ఉంది. ఈ సినిమా ప్రచారంలో నాక్కూడా భాగం కావాలి. కాని అది కుదరట్లేదు. నువ్వు సినిమా పూర్తి చేసేశావ్ గా.. నీకెందుకు బాధ.. అంట నా స్నేహితులు చెబుతున్నారు. కాని రయీస్ కూ దూరంగా ఉండటం నా అంతరాత్మ ఒప్పుకోలేకపోతోంది'' అంటూ పాకిస్తాన్ పత్రిక 'ది డాన్'కు ఇచ్చిన ఇంటర్యూలో మహీరా ఖాన్ పేర్కొంది. షారూఖ్‌ తో పనిచేయడం తన అదృష్టం అని చెబుతూ.. ఇండియాలో పరిస్థితులు తన దురదృష్టం అని చెప్పేసింది.

ఇప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న మహీరా ఖాన్ కు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినాసరే ఈమెను లీడ్ హీరోయిన్ గా తీసుకోవడం అంటే.. ఈ ముదురు భామలో షారూఖ్ కు ఏం నచ్చిందో సినిమా చూశాకనే తెలుస్తుందేమో.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/