రణబీర్-మహీరాల మధ్య ఏం జరిగిందో

Mon Mar 20 2017 21:29:37 GMT+0530 (IST)

బాలీవుడ్ యంగ్ స్టార్ రణబీర్ కపూర్.. తాజాగా దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. రణబీర్ వెళ్లిన గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఈవెంట్ కి.. రయీస్ హీరోయిన్ పాకిస్తాన్ బ్యూటీ మహిరా ఖాన్ కూడా వచ్చింది. అయితే.. అక్కడ జరిగిన సన్నివేశమే అందరినీ ఆకర్షించింది.

ముందు వీరిద్దరూ కలిసి అందరితో మాట్లాడ్డం.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కబుర్లు చెప్పడం జరిగాయి. కానీ ఆ తర్వాతే అసలు హంగామా స్టార్ట్ అయింది. వీరిద్దరి మధ్య గొడవ ఏంటో తెలియలేదు కానీ.. రణబీర్ ను మహిరా బతిమిలాడుకుంటున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. రణబీర్ కపూర్ డోర్ దగ్గర నుంచి అసహనంగా చిరాగ్గా ఉండడం.. మహిరా ఖాన్ ఏదో చెప్పి తన పట్టుకోవడం.. రెండు చేతులు కట్టుకుని వేడుకోవడం లాంటివి వీడియోలో రికార్డ్ అయ్యాయి.

ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ గా షేర్ అవుతోంది కానీ.. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఇంకా గెస్సింగ్ లోనే ఉండిపోయింది. ఇంతగా రణబీర్ కపూర్ ను వేడుకుంటోందంటే.. అక్కడ ఏదో పెద్ద మ్యాటరే జరిగి ఉంటుందంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహించేసుకుంటున్నారు.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/