Begin typing your search above and press return to search.

ఈవిడేనండీ ఆ పాకిస్తానీ పిల్ల

By:  Tupaki Desk   |   2 Jan 2017 5:41 AM GMT
ఈవిడేనండీ ఆ పాకిస్తానీ పిల్ల
X
షారూక్ ఖాన్ మూవీ రాయీస్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. రిపబ్లిక్ డే ముందు రోజున అంటే జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కి తగిన ఏర్పాట్లు జరిగాయి. రాయీస్ మూవీలో పాకిస్తానీ బ్యూటీ మహిరా ఖాన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అందుకే పలు వివాదాల్లో కూడా ఈ చిత్రం పేరు వినిపించింది. ఇప్పుడు రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడకపోవచ్చు.

తాజాగా రాయీస్ మూవీ నుంచి మహిరా ఖాన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పాకిస్తానీ ఫిలి అండ్ టీవీ యాక్ట్రెస్ కావడంతో.. మహిరా ఖాన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసినా.. ఈ మూవీకి సంబంధించిన లుక్ మాత్రం బైట పెట్టలేదు. ఇప్పుడు రాయీస్ రిలీజ్ కి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో... ఈ 32 ఏళ్ల బ్యూటీ రూపాన్ని చూపించింది రాయీస్ టీం. షారూక్ -మహిరాఖాన్ లు పక్కపక్కనే ఉన్న ఈ ఫోటోలో.. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమను పోస్టర్ ద్వారానే చూపించే ప్రయత్నం చేసింది యూనిట్.

క్రిమినల్ అబ్దుల్ లతీఫ్ స్టోరీనే రాయీస్ అంటూ తీస్తున్నారనే ప్రచారాన్ని నిర్మాతలు ఖండించారు. జనవరి 25న రాయీస్ కి పోటీగా హృతిక్ రోషన్ మూవీ కాబిల్ కూడా రిలీజ్ కానుంది. దీంతో షారూక్-హృతిక్ ల మధ్య పోటీ ఎలా ఉంటుందో అని బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/