షారూక్ హీరోయిన్ ముద్దు వీడియో వైరల్

Fri Feb 23 2018 13:03:31 GMT+0530 (IST)

షారూక్ ఖాన్ మూవీ రయీస్ లో హీరోయిన్ గా నటించిన మహిరా ఖాన్ మనకు తెలిసిన భామే. ఈ సినిమా రిలీజ్ సమయానికి పాక్ యాక్టర్లపై నిషేధం అంటూ హంగామా బిగిన్ అవడంతో.. అమ్మడి యాక్టింగ్ తప్ప.. ప్రచార హంగామా చూసే భాగ్యం భారత జనాలకు దక్కలేదు. రీసెంట్ గా ఈ పాకిస్తానీ బ్యూటీ వీడియో ఒకటి వైరల్ గా మారింది.పాక్ సీనియర్ యాక్టర్ జావేద్ షేక్ ఈమెను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం.. అతన్ని పట్టించుకోనట్లుగా ఈమె పక్కకు తిరగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ నెల 17న ఓ అవార్డ్ ఈవెంట్ జరిగింది. 2017 సంవత్సరానికి గాను.. అవార్డుల ప్రదానం చేయగా.. వెర్న చిత్రానికి గాను మహిరా ఖాన్ కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు మహిరా ఖాన్ స్టేజ్ మీదకు వెళ్లిన సమయంలో అక్కడ మవరా హోకోన్.. జావేద్ షేక్ లు ఉన్నారు. మవరాను మొదట పలకరించి.. తర్వాత జావేద్ దగ్గరకు వచ్చింది మహిరా. ఈ సమయంలో మహిరాను ముద్దాడేందుకు జావేద్ ప్రయత్నించగా.. ఆమె పక్కకు చూస్తూ ఉండిపోయింది.

ఈ వీడియోనే వైరల్ గా మారిపోయి.. రకరకాల వ్యాఖ్యలకు కారణం అవుతోంది. అయితే.. జావేద్ అంటే తమకు ఎంతో గౌరవం అని.. ఆయనను తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదని అంటోంది మహిరా ఖాన్. ఆయనను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటామని చెప్పుకొచ్చింది.