ముద్దు గొడవ గురించి నోరు విప్పిన హీరొయిన్

Fri Feb 23 2018 17:30:47 GMT+0530 (IST)

పాకిస్తాన్ హీరొయిన్ మహిరా ఖాన్ ఒక అవార్డు ఫంక్షన్ లో స్టేజి మీద తనను ముద్దు పెట్టుకోబోతున్న సీనియర్ హీరో జావేద్ షేక్ ని తప్పించుకుంటూ పక్కకు వెళ్ళిపోయిన వీడియో ఆన్ లైన్ లో రచ్చ రచ్చ  చేసిన సంగతి తెలిసిందే. దాంతో పాక్ లో జావెద్ అభిమానులు భగ్గుమనడంతో డ్యామేజ్ రిపేర్ లోకి వచ్చింది మహిరా. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పాటు పెద్ద మనిషి - అగ్ర నటుడు అయిన జావేద్ కు ఇవేం బుద్దులు అంటూ ఆన్ లైన్ లో తలంటు కూడా స్టార్ట్ అయ్యింది. ఏదో ఎవరు పట్టించుకోరులే లైట్ తీసుకుందామనుకున్న జావేద్ కు ఇది ఏకంగా తన పరువుకే ఎసరు పెట్టడంతో వెంటనే మహిరా ఖాన్ ను అలెర్ట్ చేసాడు. అప్పటికే వైరల్ అవుతున్న వీడియో దానికి వస్తున్న స్పందన చూసిన మహిరా ఎట్టకేలకు స్పందించింది.ఇవాళ ఉదయం లేచాక ఈ ఇష్యూ గురించి ఎంత రాద్ధాంతం జరుగుతుందో చూశానని న్యూస్ పబ్లిసిటి కోసం ఏమైనా చేయడానికి సిద్దపడుతున్న వైనం చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్పిన మహిరా ప్రతి దాన్ని వివాదం చేయకండి అని కోరింది. దాంతో పాటు జావేద్ షేక్ అందరివాడని ఒక లెజెండ్ ను అందరికి మార్గదర్శిగా నిలిచే వ్యక్తిని అలా చేయటం తగదని చెప్పుకొచ్చింది. అతనికి గౌరవం ఇవ్వాలని నొక్కి చెప్పిన మహిరా తను పొరపాటుగా ముద్దును తప్పుకుని పక్కకు వచ్చాను అని మాత్రం చెప్పలేదు. వీడియో చూసిన వాళ్ళు మాత్రం మహిరా కావాలనే మొహం పక్కకు తిప్పుకుని వచ్చిందని వాదిస్తున్నారు.

మొత్తానికి మహిరా ఖాన్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ తో రయీస్ చేసిన ఈ పాక్ సుందరి సాత్ దిన్ మోహబ్బత్ మౌలా జట్ 2 అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. రన్బీర్ కపూర్ తో చాలా క్లోజ్ గా ఉందని ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని గతంలో మహిరా మీద గట్టి వార్తలే వినిపించాయి. వాటిని ఇద్దరు కొట్టిపారేసారు. ఓసారి రన్ బీర్ కపూర్ - మహిరా ఖాన్ కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దాని ఖండించాక మహిరా బాలీవుడ్ మీడియాకు అందుబాటులోకి రాలేదు.