ఆ నటీమణి రాహుల్ ను ప్రేమిస్తోందట!

Mon Apr 15 2019 22:10:12 GMT+0530 (IST)

ఉచితంగా పబ్లిసిటీ పొందడానికి  ఎన్నికలను కూడా వాడుకొంటూ ఉంటారు కొంతమంది నటీమణులు. గతంలో కొంతమంది నటీమణులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించేసి ప్రచారం పొందారు. కొందరు వెళ్లి నామినేషన్లు కూడా దాఖలు చేశారు. తద్వారా కొంత సేపు వార్తల్లో నిలిచే ప్రయత్నం చేశారు.ఇక రాజకీయ నేతలపై హాట్ కామెంట్స్ చేయడం ద్వారా కొందరు వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడల్ నటీమణి మహికా శర్మ కథ కూడా ఇలానే ఉన్నట్టుంది.

మామూలుగా అయితే ఈమె గురించి రాసేది ఏమీ ఉండదు. అయితే ఈమె ఎన్నికల వేళ రాహుల్ ను లక్ష్యంగా చేసుకుంది. ఆయనను ప్రేమిస్తున్నట్టుగా ప్రకటించుకుంది. ఇంకే ముంది .. ఈమె మీడియా అటెన్షన్ ను సంపాదించుకుంది.

అసలే రాహుల్ సాబ్ బ్యాచిలర్ కదా. ఆయనను లవ్ చేస్తున్నట్టుగా ఎవరైనా ప్రకటించుకుంటే అది ఆసక్తిదాయకంగానే ఉంటుంది. ఈ అవకాశాన్ని మహికా శర్మ  ఉపయోగించుకుంది. రాహుల్ ను తను లవ్ చేస్తున్నట్టుగా ప్రకటించుకుంది. రాహుల్ అంతగా ఎందుకు ఆకట్టుకున్నాడో కూడా ఆమె వివరించింది.

'ఆయన తన ప్రసంగాలతో ప్రజలను నవ్విస్తూ ఉంటారు.. అందుకే ఆయనంటే నాకు చాలా ప్రేమ..' అంటూ మహికా శర్మ ప్రకటించుకుంది. ఇంతకీ ఈమె రాహుల్ ను పొగిడిందా? విమర్శించిందా? అనేది అర్థం చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే!