Begin typing your search above and press return to search.

వైయ‌స్‌ పై ప్రేమ దాచ‌లేదెవ‌రూ!-మ‌హి.వి.రాఘ‌వ్‌

By:  Tupaki Desk   |   9 Feb 2019 1:52 PM GMT
వైయ‌స్‌ పై ప్రేమ దాచ‌లేదెవ‌రూ!-మ‌హి.వి.రాఘ‌వ్‌
X
ఒక సినిమాని నంబర్‌ తో వెల కట్టొచ్చు కానీ అభిమానాన్ని - కళని ఎవరూ వెలకట్టలేరు. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు - వైఎస్సార్‌ అభిమానులు చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేను .. అన్నారు మ‌హి.వి.రాఘ‌వ్. మ‌మ్ముట్టి న‌టించిన `యాత్ర` ఈ శుక్ర‌వారం రిలీజై చ‌క్క‌ని ఓపెనింగ్స్ తో విజయవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మ‌హి.వి.రాఘ‌వ్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ప్రేక్ష‌కుల‌ విషయంలో రుణం తీర్చకోవడం అన్న మాట చాలా చిన్నదవుతుంద‌ని - వైయ‌స్ పై ఇంత అభిమానం ఉందని ముందు నాకు తెలిస్తే అంచనాలు చేరుకుంటామా లేదా అన్న భయంతో అసలు ఈ సినిమా తీసేవాడిని కాదేమోనని వ్యాఖ్యానించారు.

మాతృదేవోభవ టైమ్‌ లో ఓ తల్లి గురించి ఇంతగా బాధపడ్డాం. పితృదేవోభవ అన్నట్లుగా అభిమాన నాయకుడి కథను సినిమాగా మా కళ్ల ముందుంచారు .. అని చాలామంది ఫోన్‌ చేసి అభినందిస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంద‌ని అన్నారు. ఈ సినిమా తర్వాత నాపై చాలా రకాల ముద్రలు పడొచ్చు. అయినా ఫర్వాలేదు. ఎదుటి వ్యక్తిని అగౌరవ పడేలా చేయడం నాకు రాదు. నేను నమ్మిన కథను చెప్పాలనుకున్నట్లు చెప్పాను.. నేను స‌క్సెస‌య్యానా లేదా ప్రేక్ష‌కులే నిర్ణ‌యించాలి అని యాత్ర ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ అన్నారు.

మా సంస్థలో వచ్చిన మూడు సినిమాలు మూడు విభిన్న కథలతో వచ్చి విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని - వినోదాన్ని కొత్త తరహాగా అందించాలన్నదే మా ప్రయత్న మ‌ని విజ‌య్ చిల్లా తెలిపారు. విడుదలైన రోజు నుంచీ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని చూపించడంతో ఎక్కడా విమర్శలు రాలేదు. కొందరు రాజన్నను మళ్లీ గుర్తు చేశారని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ స్థాయి విజ‌యం ఊహించలేదని అన్నారు. కేరళ ప్రేక్షకులకు వైఎస్సార్‌ తెలియొచ్చు.. తెలియకపోవచ్చు.. కానీ మమ్ముట్టి పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యి అక్కడా బాగా ఆద‌రిస్తున్నార‌ని తెలిపారు. మొత్తానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు యాత్ర స‌క్సెస్ ని ఓ రేంజులో ఎంజాయ్ చేస్తున్నారు.