Begin typing your search above and press return to search.

యాత్రలో భలే మేనేజ్ చేసారే

By:  Tupaki Desk   |   10 Feb 2019 4:23 AM GMT
యాత్రలో భలే మేనేజ్ చేసారే
X
స్టార్ సపోర్ట్ లేకపోయినా చిన్న మోతాదులో రిలీజైనా యాత్ర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. వైఎస్ ఆర్ అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులకు సైతం ఇందులో కంటెంట్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మౌత్ పబ్లిసిటీ వల్ల స్క్రీన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా చాలా సెన్సిబుల్ గా సినిమా తీసిన దర్శకుడు మహి రాఘవ అప్పుడు అధికారంలో ప్రతిపక్ష పార్టీని వైఎస్ ఆర్ చుట్టూనే ఉంటూ ఆయన ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళను ఇలా ఎవరిని వదలకుండా చాలా స్పష్టంగా ప్రొజెక్ట్ చేసాడు. అయితే ఏ పాత్రా ఇంకొకరిని పేరుతో పెట్టి పిలవడం ఉండదు.

సెన్సార్ చిక్కులతో పాటు సదరు వ్యక్తులు కోర్టుకు వెళ్లి ఇబ్బందులు సృష్టించకుండా మహి రాఘవ చాలా తెలివిగా వ్యవహరించాడు. అయితే విజయమ్మ-కెవిపి-నారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను మాత్రం నేరుగా పేరుతో పిలిపించేసాడు. ఇదే ఇప్పుడు థియేటర్లో బాగా పేలుతోంది. ముఖ్యంగా మనదేశం పార్టీ ఆఫీస్ మీటింగ్ లో జీవాకు బిగ్ బాస్ ఫోన్ చేసినప్పుడు దే బ్రీఫ్డ్ మీ అంటూ చెప్పించడం ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది ఇది ఒకరకంగా గతంలో వర్మ లాంటి వాళ్ళు వాడిన ఫార్ములానే.

ముప్పై ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్టీఆర్ విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీసినప్పుడు అందులో ముఖ్యమంత్రి పాత్ర వేషధారణ ఆయనలాగే ఉన్నప్పటికీ పేరు మాత్రం ధర్మా రావు అనో లేక ఇంకేదో రావని పెట్టి అభ్యంతరం లేకుండా చూసుకునే వాళ్ళు. వర్మ సైతం రక్త చరిత్రలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. సో ఇప్పుడు మహి రాఘవ అందిపుచ్చుకున్న ఈ ఎత్తుగడ మంచి ఫలితాన్నే ఇచ్చింది. లేకపోతే మమ్మల్ని కించపరుస్తూ సినిమా తీసారని సదరు వ్యక్తుల నుంచి ఈపాటికే గోల మొదలైపోయేది. అవును మరి శ్రీదేవి అని టైటిల్ లో ఓ భాగంగా పెట్టినందుకే బోనీ కపూర్ ఓ నిర్మాతకు లీగల్ నోటీసులు పంపించాడు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేది అందుకే