నాకు హిందీ రాదని ఎవరన్నారు-మహేష్

Mon Sep 25 2017 01:00:01 GMT+0530 (IST)

మహేష్ బాబు పుట్టింది పెరిగింది చెన్నైలో కాబట్టి అతడికి తమిళం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇటీవలి ‘స్పైడర్’ ఆడియో వేడుకలో అనర్గళంలో తమిళంలో మాట్లాడుతూ.. జోకులు పేల్చుతూ అక్కడి జనాల్ని ఉర్రూతలూగించాడు మహేష్. ‘స్పైడర్’ తమిళ వెర్షన్ కు మహేష్ స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ఐతే మహేష్ కు తమిళం మాత్రమే కాదట.. హిందీ కూడా అంతే బాగా వచ్చట. కానీ తనను ఎగ్జైట్ చేసే ప్రాజెక్టు రాలేదు కాబట్టే హిందీలో ఇప్పటిదాకా సినిమా చేయలేదని చెప్పాడు మహేష్. మురుగదాస్ లాగే బాలీవుడ్ నుంచి ఎవరైనా అగ్ర దర్శకులు మంచి స్క్రిప్టుతో సంప్రదిస్తే తాను హిందీలో కూడా సినిమా చేస్తానని అన్నాడు మహేష్.బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా.. హిందీ సరిగా మాట్లాడలేరు కాబట్టే అక్కడ సినిమా చేయలేకపోయారా అని మహేష్ ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘‘నేనెప్పుడు హిందీ మాట్లాడటం ఇక్కడి వాళ్లు చూడలేదు కాబట్టే నాకు హిందీ రాదనుకుంటున్నారేమో. నేను హిందీ కూడా బాగా మాట్లాడతాను. తెలుగులో చేతి నిండా పని ఉన్నపుడు అక్కడికి ఎందుకు వెళ్లడం అని నా ఫీలింగ్. ఇప్పటిదాకా నన్ను ఎగ్జైట్ చేసే కథ రాలేదు. మురుగదాస్ గారు నన్ను ఎగ్జైట్ చేసే కథ చెప్పడంతో తమిళంలో చేశాను. ఆయన లాగే బాలీవుడ్ అగ్ర దర్శకులు నన్ను ఎగ్జైట్ చేస్తే హిందీలో కూడా సినిమా చేస్తానేమో. ఐతే ప్రస్తుతానికి నా ఫోకస్ తెలుగు సినిమాల మీదే. ఇక్కడే నేను చేయాల్సింది చాలా ఉందని నా అభిప్రాయం’’ అని మహేష్ తెలిపాడు.