పవన్ - మహేష్ - బాలయ్యలకు ఫైన్

Sat Jan 12 2019 17:56:32 GMT+0530 (IST)

చట్టం ఎవరికి చుట్టం కాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఒకొక్కరికి ఒక్కో విధంగా ఏమీ ఉండవు. అవి సామాన్యులకైనా సెలబ్రెటీలకైనా ఒకే విధంగా ఉంటాయి. ప్రతి రోజు వేలల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగడం లక్షలాది రూపాయల జరిమానాలు విధించడం హైదరాబాద్ లో చాలా కామన్ విషయం. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిలో ప్రముఖ సెలబ్రెటీలు ఎంతో మంది ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ట్రాఫిక్ ను ఉల్లంఘించడంతో పాటు అందుకు సంబంధించిన చలానాలు చెల్లించుకుండా దాటవేస్తూ వస్తున్నారు.మహేష్ బాబుకు చెందిన కారు మూడు సంవత్సరాల కాలంలో 7 సార్లు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేశాడట. మహేష్ కారుపై మొత్తం 8745 రూపాయల ఫైన్ ఉంది. ఆ ఫైన్ ను ఇప్పటికి కూడా మహేష్ బాబు చెల్లించలేదు. మరో మూడు సార్లు మహేష్ కారు రూల్స్ ను బ్రేక్ చేస్తే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు కానుందట. ఇక పవన్ కళ్యాణ్ కారు కూడా మూడు సార్లు రూల్స్ ను బ్రేక్ సిందట. పవన్ కారుపై మొత్తం 505 రూపాయల చలానా బకాయి ఉందట. బాలకృష్ణ కారుపై కూడా చలానా ఉంది. బాలకృష్ణ రెండు సార్లు రూల్స్ ను బ్రేక్ చేసినట్లుగా పోలీసుల రికార్డుల్లో ఉంది. 1035 రూపాయల ఫైన్ బాలకృష్ణ చెల్లించాల్సి ఉంది.

సునీల్ ఔటర్ రింగ్ రోడ్డుపై అతి వేగంగా వెళ్లడం వల్ల ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినది. సునీల్ 4540 రూపాయలు చలానా బాకీ ఉన్నాడట. నితిన్ కూడా ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేశాడట. నితిన్ 1035 రూపాయల జరిమాన కట్టాల్సి ఉంది. ఇంకా ఎంతో మంది సినిమా సినీ స్టార్స్ కూడా ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసి ఫైన్ కట్టారు ఇంకా కొందరు ఫైన్ కట్టాల్సి ఉంది.