Begin typing your search above and press return to search.

ఒక్కటి పడితే సుధీర్ స్టారే - మహేష్

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:09 PM GMT
ఒక్కటి పడితే సుధీర్ స్టారే - మహేష్
X
ఘట్టమనేని వంశ హీరోలకు వారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించిన సుధీర్ బాబుకు హీరో కష్ణతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆశీస్సులు కూడా ఫుల్లుగానే ఉన్నాయి. వారసుడిగానే ఇండస్ట్రీలో ప్రవేశించినా.. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు సుధీర్ బాబు.

ఇప్పుడీ కుర్ర హీరో నటించిన లేటెస్ట్ మూవీ భలే మంచి రోజు. ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసే కాన్సెప్ట్ తో, ఒక రోజు జరిగే సంఘటనలను బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కింది. సుధీర్ బాబుకి జంటగా వామిక హీరోయిన్ గా నటించిన భలే మంచి రోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఫంక్షన్ లో మహేష్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

సాధారణంగా సినిమా ఫంక్షన్లకి వచ్చినపుడు హీరోహీరోయిన్లని పొగడ్డం కామనే కానీ.. ఒక కరెక్ట్ సినిమా పడితే సుధీర్ బాబు స్టార్ అయిపోతాడన్నాడు మహేష్. ఇప్పటివరకూ చేసిన సినిమాల లిస్ట్ చూసుకుంటే.. సుధీర్ బాబుకి కాన్సెప్ట్ సినిమాలే అచ్చొచ్చాయి. ఇప్పుడు వస్తున్న భలే మంచి రోజు కూడా అలాంటిదే. ప్రేమ కథా చిత్రం తర్వాత ఆ జోష్ ని కంటిన్యూ చేయడంలో వెనకబడ్డ సుధీర్ బాబు.. బ్లాక్ బస్టర్ సాధించడంలో మాత్రం ఇంకా సక్సెస్ కాలేదు. ఒక వేళ మహేష్ అన్నట్లు అదొక్కటి వస్తే మాత్రం.. ఇతగాడితో సినిమా తీసేందుకు చాలామందే క్యూలో ఉంటారు. మహేష్ అండదండలు ఫుల్లుగా ఉండడం కూడా దీనికి ఒక రీజన్ గా చెప్పచ్చు