ఫ్లాప్ సినిమాకు రీమేక్ దేనికి?

Tue Jun 12 2018 16:20:43 GMT+0530 (IST)

టీజర్ - ట్రైలర్ సినిమాకు ఒక రేంజిలో హైప్ తెచ్చిపెట్టినప్పటికీ స్పైడర్ సినిమా ఒక డిసాస్టర్ గా మిగిలిపోయింది. మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవన్నీ ఆవిరైపోయాయి. తమిళ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో తీశారు. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చకపోయినా - సినిమా తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని హిట్ అయ్యింది. ఇపుడు ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారట.ఈమధ్యనే మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు మురుగదాస్ స్పైడర్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యక్తపరిచారు. హీరో మహేష్ బాబు అని బయట పెట్టకపోయినా - తెలుగు మరియు తమిళ భాషల్లో నటించాడు కనుక మహేష్ ఇందులో కూడా నటిస్తాడు అని వార్తలు వచ్చాయి. ఇప్పటిదాకా మహేష్ బాబు డైరెక్ట్ హిందీ సినిమా ఏది చేయలేదు. కనుక ఇదే తనకు డెబ్యూ సినిమా అవుతుంది. అందుకే ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఏంటా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు.

ఇంతకు ముందు బాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉందా అని అడిగితే మహేష్ మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తానని సెలవిచ్చాడు. కాగా స్పైడర్ రీమేక్ తోనే ఎంట్రీ ఇస్తున్న విషయంపై ఇంకా మన ప్రిన్స్ స్పందించాల్సి ఉంది. స్పైడర్ డిజాస్టర్ నుండి కోలుకుని భరత్ అనే నేను తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.