Begin typing your search above and press return to search.

ఒక్క టీజర్ కోసం 35 లక్షలా?

By:  Tupaki Desk   |   17 Feb 2017 10:50 AM GMT
ఒక్క టీజర్ కోసం 35 లక్షలా?
X
మహేష్-మురుగదాస్ సినిమా షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషం కూడా బయటికి రాలేదు. టైటిల్ లోగో కానీ.. ఫస్ట్ లుక్ కానీ లాంచ్ చేయలేదు. దీంతో మహేష్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఐతే మహేష్ మూవీ ఫస్ట్ టీజర్ లండన్లో తయారవుతోందని.. అతి త్వరలోనే అది విడుదలవుతుందని ఒక హాట్ న్యూస్ బయటికి రావడంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టీజర్ కు సంబంధించి అందుతున్న లేటెస్ట్ అప్ డేట్ అయితే టాలీవుడ్లో అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మహేష్-మురుగ టీజర్ కోసం ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేస్తున్నారట.

లండన్లో ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో ఈ టీజర్ ను తీర్చిదిద్దుతున్నట్లు.. ఆ పని దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఈ 35 లక్షల వార్త నిజమైతే ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ టీజర్ అవుతుంది. మామూలుగా మురుగదాస్ తన సినిమాల టీజర్.. ట్రైలర్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటాడు. రషెస్ చూసి అక్కడక్కడా కొన్ని షాట్లు కట్ చేసి టీజర్ వదిలేసే రకం కాదు అతను. టీజర్ తోనే జనాలపై బలమైన ఇంపాక్ట్ వేయాలని భావిస్తాడతను. అందుకోసం ఒక థీమ్ ప్రకారం టీజర్.. ట్రైలర్ తయారు చేయిస్తాడు. మహేష్ బాబుతో సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మురుగదాస్.. అభిమానుల ఆకలి తీర్చేలా టీజర్ చాలా ప్రత్యేకంగా ఉండాలని.. తమిళ ప్రేక్షకుల్ని సైతం ఈ టీజర్ ఆకర్షించి అక్కడా ఈ చిత్రానికి క్రేజ్ వచ్చేలా ఉండాలని స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ టీజర్ కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/